కేజ్రీవాల్ కు ఈసారైనా?
పంజాబ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా పంజాబ్ లో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఈసారి శిరోమణి అకాలీదళ్, బీజేపీ విడివిడిగా [more]
పంజాబ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా పంజాబ్ లో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఈసారి శిరోమణి అకాలీదళ్, బీజేపీ విడివిడిగా [more]
పంజాబ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా పంజాబ్ లో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఈసారి శిరోమణి అకాలీదళ్, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎటూ అధికారంలో ఉంది. దీంతో ఈ మూడు పార్టీల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతు పలుకుతూ ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో కొన్ని స్థానాలనైనా గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారు.
గతంలోనూ పంజాబ్ లో….
ఆమ్ ఆద్మీ పార్టీ గతంలోనూ పంజాబ్ లో అనుకున్న విజయాలను సాధించింది. ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత పట్టు ఉందన్నది వాస్తవం. 2014 లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లో నాలుగు లోక్ సభ స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. ఏడు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ పీఠాన్ని మూడో సారి విజయం సాధించిన తర్వాత కేజ్రీవాల్ పంజాబ్ లో తాము బరిలోకి దిగుతామని ప్రకటించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ లో చుక్కెదురయింది. ఒక్క స్థానంలోనే విజయం సాధించింది.
రైతు సమస్యలపై….
ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ఈసారి పంజాబ్ లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ రైతులను కలవాలనుకున్నా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే దీనిని తనకు అనుకూలంగా మలచుకోవడంలో కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు.
కష్టమేనా?
అయితే పంజాబ్ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కాంగ్రెస్ తరుపున వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ సొంతంగా పంజాబ్ లో వ్యూహరచన చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి గట్టి పోటీ ఇవ్వాలన్న లక్ష్యంతో కేజ్రీవాల్ ఉన్నారు. పంజాబ్ లో కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ బలంగా ఉండటంతో కేజ్రీవాల్ ఎలా సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.