అడ్డం పెట్టి అస్త్రాలు వదులుతున్నారా?
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పూసపాటి రాజుల కుటుంబానికి మంచి పేరు ఉంది. వారు అన్ని చోట్లా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉంది. ఇక దాదాపు ఎనభై ఏళ్ళుగా [more]
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పూసపాటి రాజుల కుటుంబానికి మంచి పేరు ఉంది. వారు అన్ని చోట్లా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉంది. ఇక దాదాపు ఎనభై ఏళ్ళుగా [more]
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పూసపాటి రాజుల కుటుంబానికి మంచి పేరు ఉంది. వారు అన్ని చోట్లా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉంది. ఇక దాదాపు ఎనభై ఏళ్ళుగా చట్ట సభల్లో వారి ప్రాతినిధ్యం కూడా ఉంది. ఆ వంశం వారసుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ని ఇపుడు చంద్రబాబు ముగ్గులోకి లాగారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అశోక్ గజపతి రాజు చాలా కాలంగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆయన రాజకీయంగా అంత క్రియాశీలకంగా లేరు. ఇంకా చెప్పలంటే ఎపుడైతే ఆయన్ని కేంద్ర మంత్రిగా తప్పించారో నాటి నుంచి అశోక్ గజపతి రాజు తన పనేదో తానేంటో అన్నట్లుగానే టీడీపీలో ఉన్నారు.
వ్యతిరేకమా….?
ఇదిలా ఉండగా అశోక్ గజపతి రాజు ఉత్తరాంధ్ర వాసి. పైగా రాజులు, రాజ్యాలు అంటూ రెండు శతాబ్దాల క్రితం అటు విజయనగరం, ఇటు విశాఖను కలిపి ఏలిన చరిత్ర ఉన్న వంశానికి చెందిన వారు. అంటువంటి అశోక్ గజపతి రాజు విశాఖకు రాజధాని ఇస్తామంటే వ్యతిరేకిస్తున్నారా? ఆయన ఆ విధంగా అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అశోక్ గజపతి రాజు సీన్ లోకి దించి టీడీపీ ఉత్తరాంధ్ర రాజకీయాన్ని నరుక్కురావాలనుకుంటోంది. మరి అశోక్ గజపతి రాజు స్వతహాగా ఈ ప్రాంతానికి చెందిన నేతగా స్వాగతించాలి తప్ప వద్దు అనరాదు, కానీ అశోక్ గజపతి రాజు ఎందుకో బాబు రాజకీయానికి లొంగారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఆయన అమరావతి ముద్దు అంటున్నారు. దాని మీద విమర్శల జడివాన కురుస్తోంది.
కోట రాజకీయాలు ఆపాలి….
పూసపాటి కుటుంబాన్ని రెండు సార్లు ఓడించిన చరిత్ర ఉన్న వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి గట్టిగానే తగులుకుంటున్నారు. కోట రాజకీయాలు ఇపుడు చెల్లవని కూడా గట్టిగా అంటున్నారు, దాదాపుగా నలభైయ్యేళ్ళ రాజకీయ జీవితంలో అశోక్ గజపతి రాజు రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా సొంత జిల్లాకు ఏం చేయలేదని, వెనకబడిన ప్రాంతంగానే ఉంచారని కోలగట్ల ఫైర్ అయ్యారు. అటువంటి అశోక్ గజపతి రాజు ఇపుడు తగుదునమ్మా అంటూ విశాఖ రాజధాని ప్రతిపాదనను తప్పు పట్టడం అంటే కుట్ర రాజకీయమేనని ఆయన సెటైర్లు వేస్తున్నారు.
అవసరమా…?
రాజకీయంగా వైరాగ్యంలో మునిగిపోయినఅశోక్ గజపతి రాజు ఇపుడు ఉత్తరాంధ్ర ప్రయోజనాలు అడ్డంగా నిలబడడం మంచిదేనా అన్న చర్చ ముందుకు వస్తోంది. అశోక్ గజపతి రాజుకి పార్టీలకు అతీతంగా మంచి పేరు జనంలో ఉంది. ఆయన నిజాయతీపరులని కూడా అంటారు. అటువంటి అశోక్ గజపతి రాజు టీడీపీ సంకుచిత రాజకీయాలకు మరో మారు బలి అవుతున్నారా అన్న ఆవేదన సొంత అనుచరుల్లో కూడా ఉంది. ఓడిపోయిన తరువాత ఇప్పటివరకూ జరిగిన ఏ పరిణామంలోనూ జోక్యం చేసుకోవడం, కానీ స్పందించడం కానీ చేయని రాజు గారు అదే తీరు కనబరిస్తే గౌరవంగా ఉండేదని అంటున్నారు. ఏది ఏమైనా అశోక్ ని ముందు పెట్టి బాణాలు వేయాలనుకోవడం ద్వారా బాబు వరకూ బాగానే ఉంటారు కానీ పూసపాటి వారి వంశీకుల ప్రభ మాత్రమే మసకబారుతుందని విశ్లేషిస్తున్నారు.