బెయిల్ మీద వచ్చి…..రాజుగారి లా పాయింటు ?
ఆయన నిజంగా రాజుగారే. వారి వంశీకులు రాజ్యాలను ఏలారు, శాసనాలు చేశారు. న్యాయం, ధర్మం, చట్టం రాజుల ఏలుబడిలో వారు వారు చెప్పినట్లే నాడు జరిగేది. ఇపుడు [more]
ఆయన నిజంగా రాజుగారే. వారి వంశీకులు రాజ్యాలను ఏలారు, శాసనాలు చేశారు. న్యాయం, ధర్మం, చట్టం రాజుల ఏలుబడిలో వారు వారు చెప్పినట్లే నాడు జరిగేది. ఇపుడు [more]
ఆయన నిజంగా రాజుగారే. వారి వంశీకులు రాజ్యాలను ఏలారు, శాసనాలు చేశారు. న్యాయం, ధర్మం, చట్టం రాజుల ఏలుబడిలో వారు వారు చెప్పినట్లే నాడు జరిగేది. ఇపుడు రోజులు మారాయి. ప్రజాస్వామ్యంలో అంతా ఉన్నారు. అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అయితే పేరుకే ప్రజాస్వామ్యం అన్న దాన్ని చేసి చూపించిన చరిత్ర టీడీపీదే. ఆ పార్టీ ఏలుబడిలో ప్రజాస్వామ్యాన్ని నీరు కార్చిన సంఘటనలు అనేకం. నాడు విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ ని అక్రమంగా బంధించి వచ్చిన వారిని వచ్చినట్లే తిప్పి పంపిన చరిత్ర టీడీపీదే. ఆ విషయాలని విజయనగరం రాజు గారు అశోక్ మరచిపోయినట్లున్నారు. ఇపుడు మాత్రం ఒకటే గుండెలు బాదుకుంటున్నారు.
అక్రమమే….
చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అక్రమమని అశోక్ గజపతిరాజు అంటున్నారు. ఇది అసలు ప్రజాస్వామ్యమేనా, మనం నియంత పాలనలో ఉన్నమా అని ఆయన నిప్పులు చెరుగుతున్నారు. తెల్లదొరలు పోయారనుకుంటే నల్ల దొరలు వచ్చారని జగన్ ని నిందిస్తున్నారు. ఆయనకు ప్రజాస్వామ్యం తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. తాను విమాన మంత్రిగా ఉండగా తన పరిధిలోని ఎయిర్ పొర్టులోకి సివిల్ పోలీసులు వచ్చి జగన్ ని రన్ వే మీద అరెస్ట్ చేయడాన్ని నాడు కనీసం తప్పు పట్టని అశోక్ గజపతి రాజు ఇపుడు మాత్రం పెద్ద నోరు చేశారు. బాబు వరకూ కధ రాగానే ఆయనలో ప్రజాస్వామ్యవాది అలా బయటపడ్డారని వైసీపీ నెతలు సైటైర్లు వేస్తున్నారు.
జగన్ మీద హార్ష్ గా ….
ఇక అశోక్ గజపతి రాజు మరో మాట కూడా అన్నారు. ఇది చాలా హార్ష్ గా ఉండడంతో వైసీపీ నేతలు మండిపోతున్నారు. బెయిల్ మీద వచ్చిన జగన్ ముఖ్యమంత్రిగా గద్దెను ఏలడమేంటి అని రాజు గారు కొత్త లాజిక్ పాయింట్ తీసుకున్నారు. అసలు జగన్ కి పాలన చేసే హక్కు లేదని ఆయన అంటున్నారు. దేశంలో ఎక్కడైనా ఇలా ఉందా, బెయిల్ మీద వచ్చిన వారు పాలకులు కావడం ఏంటని అశోక్ గజపతి రాజు అపుడే నిద్ర లేచినట్లుగా మాట్లాడుతున్నారు. బెయిల్ మీద ఉన్న జగన్ కి బాబుని అరెస్ట్ చేస్తే హక్కు లేదుట. ఇదీ రాజు గారి తీర్పూ, తీర్మానంగా ఉంది.
క్లారిటీ ఇచ్చారా….?
మరో వైపు చంద్రబాబుని అడ్డుకున్నదే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నందుకు. అయితే మూడు రాజధానులకు తాము వ్యతిరేకమని క్లారిటీగా అశోక్ గజపతి రాజు చెబుతున్నారు. మూడు రాజధానులేంటి విడ్డూరం కాకపోతేనని ఆయన అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే తాము అమరావతికే కోరుకుంటున్నామని, దాన్నే గట్టిగా చెబుతామన్నది అశోక్ గజపతి రాజు ఆలోచనగా ఉంది. అలాగైతే ఉద్రిక్తతలు రావా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అందుకే బాబుని అరెస్ట్ చేస్తే పెడబొబ్బలెందుకని మంత్రి బొత్స సత్యనారాయణ గట్టిగా నిలదీస్తున్నారు. బాబు, తమ్ముళ్ళు ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలలో అశాంతి రేపి రెచ్చగొడతామంటే ఊరుకోమని కూడా చెబుతున్నారు.