పెద్దరికానికి పెద్ద దెబ్టడిపోయిందిగా
రాజుల కోటను ముట్టడించడం అంటే అంతా పకడ్బందీగా చేయాలి. లేకపోతే ఉసురే పోతుంది. అందుకే స్కెచ్ బాగానే వేసింది వైసీపీ. దాంతో అనూహ్యంగా కోటకు దెబ్బ పడిపోయింది. [more]
రాజుల కోటను ముట్టడించడం అంటే అంతా పకడ్బందీగా చేయాలి. లేకపోతే ఉసురే పోతుంది. అందుకే స్కెచ్ బాగానే వేసింది వైసీపీ. దాంతో అనూహ్యంగా కోటకు దెబ్బ పడిపోయింది. [more]
రాజుల కోటను ముట్టడించడం అంటే అంతా పకడ్బందీగా చేయాలి. లేకపోతే ఉసురే పోతుంది. అందుకే స్కెచ్ బాగానే వేసింది వైసీపీ. దాంతో అనూహ్యంగా కోటకు దెబ్బ పడిపోయింది. విజయనగరం రాజులంటేనే ఉత్తరాంధ్రాలో పెట్టింది పేరు. దాదాపు వందేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. అంతకు ముందు సొంతంగా రాజ్యాలను ఏలారు. శతాబ్దాల చరిత్ర వారి సొంతం. అటువంటి పూసపాటి రాజులను చక్రబంధంలో బంధించేసింది వైసీపీ. గతంలో కాంగ్రెస్ కి పీవీజీరాజు, తరువాత ఆయన పెద్ద కుమారుడు ఆనందగజపతిరాజు దన్నుగా ఉంటే నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి గట్టి మద్దతుదారుగా అశోక్ గజపతిరాజు ఉన్నారు. ఒకసారి ఓడినా కూడా ఆయన మరో ఎన్నికల్లో అంతకు రెట్టింపుగా పుంజుకుంటున్నారు. అందుకే బాబు సైతం ఆయన్ని కాదనే పరిస్థితి లేదు. ఇపుడు జగన్ మార్క్ వ్యూహంతో ఆ రాజుల కంచుకోట బద్దలైంది.
సంచలనమే…..
సంచయిత గజపతిరాజు. ఈ పేరు కొత్తగా ఉన్నా పూసపాటి వారి కోటలో విరబూసిన పూబాల ఆమె. ఆనందగజపతి రాజు, ఉమా గజపతిరాజుల ముద్దుల తనయ. ఉమా గజపతిరాజు విశాఖ ఎంపీగా మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఆ తరువాత ఆనంద్ ఉమా విడాకులు తీసుకున్నారు. ఇపుడు వారి కుమార్తెగా తన వారసత్వం కోసం దూసుకువచ్చినదే సంచయిత గజపతిరాజు. ఆమె దాదాపుగా పదేళ్ళుగా కోస్తా జిల్లాల్లో ఎన్జీవో సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
అటు కమలంతో ….
ఇక రాజకీయంగా కూడా సంచయిత గజపతిరాజు బీజేపీలో చేరారు. అది కూడా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమె కాషాయం కప్పుకున్నారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తుందని అప్పట్లో టాక్ నడించింది. అయినా కూడా ఎందుకో దూరంగా ఉండిపోయారు. ఇంతలో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు జై కొట్టి బాబాయ్ అశోక్ గజపతిరాజునే ఖంగు తినిపించిన ఆమె వైసీపీ వైపుగా మొగ్గు చూపారు. మరి తెర వెనక ఏ విజయసాయిరెడ్డి సారధిగా ఉన్నారో తెలియదు కానీ ఆమె హఠాత్తుగా ఉత్తరాంధ్రాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన సింహాచలం వరహా నరసింహా స్వామి వారి ఆలయ ట్రస్ట్ బోర్డ్ కి చైర్ పర్సన్ అయిపోయారు. ఇది నిజంగా అనూహ్యం, అవాక్కు అయ్యే పరిణామంగా పూసపాటి వంశీకులు భావిస్తున్నారు. ఈ పదవి కేవలం పూసపాటి వారి అనువంశీకులకే శాశ్వతంగా కేటాయించేశారు. అటువంటిది జగన్ సర్కార్ ఆమెను పూసపాటి వారి అనువంశిక ధర్మకర్తగా గుర్తించింది. అంతే కేవలం ఆమె ఒక్క ప్రభుత్వ ఉత్తర్వుతో ఒక్కరే ప్రమాణం చేసి సంచలనం సృష్టించారు.
అశోక్ కి దెబ్బేనా….
ఈ పరిణామం అశోక్ గజపతి రాజు కి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. అన్నిటికీ మించి ఆయన పెద్దరికానికి కూడా బ్రేక్ పడినట్లుగా చెబుతున్నారు. సింహాచలం ఆలయానికి వేలాది ఎకరాలు ఉన్నాయి. అదే విధంగా మాన్సాస్ ట్రస్ట్ పేరిట వేలాది భూములు ఉన్నాయి. సంచయిత గజపతి రాజుని ఈ రెండు ట్రస్టులకు చైర్ పర్సన్ ని చేయడం ద్వారా మొత్తం పూసపాటి వంశాన్నే జగన్ సర్కార్ తమ వైపునకు లాక్కునట్లైంది. దీని వెనక జగన్ సన్నిహితుడు, ఎంపీ విజయసాయిరెడ్డి మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు. ఇక అశోక్ గజపతి రాజు కి రాజకీయ పదవులు లేకపోయినా సంస్థానం పదవులతో పెద్దరికం నిలబెట్టుకునేవారు. ఇపుడు వాటికి కూడా తెలివిగా జగన్ సర్కార్ మంగళం పాడేసినట్లైంది. మరో వైపు రాజకీయంగా చూసుకున్నా అశోక్ కుమార్తె అదితి గజపతి రాజు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి జనంలో ఉంటూ గట్టి పట్టు సంపాదించుకున్న సంచయిత గజపతిరాజు రేపటి రోజుల హోల్ మొత్తం పూసపాటి వంశానికి ఏకైక రాజకీయ వారసురాలు అయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఈ పరిణామాలు మరోవైపు టీడీపీకి కూడా గట్టి షాక్ ఇస్తున్నాయి.