ఇప్పట్లో ముడిపడేట్లు లేదుగా…?
దాదాపు ఆరు దశాబ్దాల క్రితం విజయనగరం సంస్థానధీశుడి హోదాలో అప్పటి పూసపాటి వంశీకుడు పీవీజీ రాజు మాన్సాస్ ట్రస్ట్ ని స్థాపించారు. ఆశయాలు చాలా ఉన్నతమైనవి. విద్యా, [more]
దాదాపు ఆరు దశాబ్దాల క్రితం విజయనగరం సంస్థానధీశుడి హోదాలో అప్పటి పూసపాటి వంశీకుడు పీవీజీ రాజు మాన్సాస్ ట్రస్ట్ ని స్థాపించారు. ఆశయాలు చాలా ఉన్నతమైనవి. విద్యా, [more]
దాదాపు ఆరు దశాబ్దాల క్రితం విజయనగరం సంస్థానధీశుడి హోదాలో అప్పటి పూసపాటి వంశీకుడు పీవీజీ రాజు మాన్సాస్ ట్రస్ట్ ని స్థాపించారు. ఆశయాలు చాలా ఉన్నతమైనవి. విద్యా, వైద్యం సేవా కార్యక్రమాలే అజెండాగా చేసుకుని ట్రస్ట్ ముందుకు సాగాలని నాటి వ్యవస్థాపకులు ఆకాంక్షించారు. పీవీజీ రాజు 1995లో మరణించారు. ఆయన తరువాత పెద్ద కుమారుడిగా మాజీ మంత్రి ఆనందగజపతిరాజు చైర్మన్ అయ్యారు. ఆయన మరణించేటంతవరకూ ట్రస్ట్ ని సమర్ధంగానే నడిపారు. ఆయన హయాంలో ఏ వివాదాలూ చోటు చేసుకోలేదు.
అశోక్ ఏలుబడిలో…….
ఇక ఆనంద్ కూడా ముందు రాజకీయ నాయకుడే. కానీ ముక్కు సూటి నేత. లౌక్యం తెలియదు, పైగా నిజాయతీ ఆయనకు ఉన్న గొప్ప సుగుణం. ఆయన హాయంలో అందులే ఎక్కడా ఒక్క మాట, మచ్చ మాన్సాస్ కి రాలేదు అని చెబుతారు. ఇక ఆయన మరణాంతరం ట్రస్ట్ బాధ్యతలు కుటుంబ సభ్యులు గా ఉన్నవారంతా కలసి నిర్ణయించుకోవాలి. అయితే రాత్రికి రాత్రే ఒక జీవో తెచ్చి అశోక్ గజపతిరాజు ని బాబు చైర్మన్ పదవిలో కూర్చోబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు ట్రస్ట్ మెంబర్స్ గా నాడే టీడీపీ నేతలుగా కుటుంబరావు వంటి వారిని బాబు పెట్టారని విమర్శలు ఉన్నాయి.
వైసీపీ నీడలో …..
ఇక వైసీపీ అధికారంలోకి రావడంతో విశాఖను రాజధానిగా ప్రకటించింది. దాంతో ఉత్తరాంధ్రా రాజకీయాల మీద చూపు పడింది. ఈ పరిణామాల క్రమంలో ఈ ఏడాది మొదట్లో మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఆనంద్ పెద్ద కుమార్తె సంచయిత గజపతి రాజుని నియమించారు. దాంతో దుమారం చెలరేగింది. ఆమెకి ఆ హక్కు లేదు అని కూడా అశోక్ గజపతి రాజు సహా అంతా ఆరోపించారు. ఈ వివాదం కోర్టులో ఉండగానే అటు అశోక్ టీడీపీ ముఖ్యుడు కావడం, ఇటు సంచయిత వైసీపీ ద్వారా పదవి పొందడంతో మాన్సాస్ పేరిట మళ్ళీ పార్టీల క్షుద్ర రాజకీయాలు మొదలయ్యాయని అంటున్నారు.
మాన్సాస్ అంటే భూములేనా…?
మాన్సాస్ ట్రస్ట్ ని పూసపాటి వారి పూర్వీకులు ఉత్తమ ఆశయంతో స్థాపించారు. అయితే మాన్సాస్ పేరు ఇపుడు చెబితే మీరు భూములు దిగమింగారు. అంటే మీరు మింగారు అంటూ రాజుల వారసులు ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకోవడం పట్ల ప్రజలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాన్సాస్ అంటే సేవలకు ప్రతిబింబమని కూడా అంటున్నారు. అలాంటిది మాన్సాస్ పేరిట జుగుప్సాపూరితమైన రాజకీయాలకు తెర తీయడం బాధాకరమని అంటున్నారు. యాభై వేల ఎకరాలు భూములు ఉన్న మాన్సాస్ ట్రస్ట్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది.
సేవ్ మాన్సాస్…..
ఇపుడు బాబాయ్ అశోక్ గజపతిరాజు కి టీడీపీ మద్దతు ఇస్తే సంచయిత వెనక వైసీపీ నేతలు ఉన్నారు. దాంతో రాజకీయ పార్టీల నీడను విడిచి గజపతులు వారసులు ఒక్క చోట చేరి ఈ వివాదానికి స్వస్తి వాచకం పలకాలని మేధావుల నుంచి సూచనలు వస్తున్నాయి. అయితే తన కుమార్తె అదితిని రాజకీయ వారసురాలిగా ప్రకటించిన అశోక్ గజపతులకు కొత్త వారసులు వస్తే పోటీకి అని భావిస్తారన్న మాట ఉంది. ఇక సంచయిత సైతం బాబాయ్ తో కలసి పనిచేయడానికి సిధ్ధపడడం లేదు అంటున్నారు. మొత్తానికి ఇది టీవీ సీరియల్ మాదిరిగా విజయనగరం వీధుల్లో సాగుతోంది. తాజాగా సేవ్ మాన్సాస్ ఉద్యమానికి అశోక్ గజపతి రాజు నాయకత్వం వహించడంతో మాన్సాస్ రాజకీయం మరింత రక్తి కట్టేలా కనిపిస్తోంది.