ఈయనను పూర్తిగా పక్కన పెట్టాల్సిందేనా?
ఉత్తరాంధ్ర జిల్లాలోని కీలకమైన జిల్లా విజయనగరం. ఇక్కడ టీడీపీని కొన్ని దశాబ్దాలుగా నడిపిస్తున్నారు కేంద్ర మాజీ మంత్రి, రాజవంశీయులు అశోక్ గజపతిరాజు. ఇప్పుడు కూడా ఆయనే జిల్లా [more]
ఉత్తరాంధ్ర జిల్లాలోని కీలకమైన జిల్లా విజయనగరం. ఇక్కడ టీడీపీని కొన్ని దశాబ్దాలుగా నడిపిస్తున్నారు కేంద్ర మాజీ మంత్రి, రాజవంశీయులు అశోక్ గజపతిరాజు. ఇప్పుడు కూడా ఆయనే జిల్లా [more]
ఉత్తరాంధ్ర జిల్లాలోని కీలకమైన జిల్లా విజయనగరం. ఇక్కడ టీడీపీని కొన్ని దశాబ్దాలుగా నడిపిస్తున్నారు కేంద్ర మాజీ మంత్రి, రాజవంశీయులు అశోక్ గజపతిరాజు. ఇప్పుడు కూడా ఆయనే జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అయితే.. 2019లో ఆయన ప్రభ ఎక్కడా కనిపించలేదు. జిల్లాలో ఎంపీ సీటుతో సహా అన్నీ స్థానాలు క్లీన్‌స్వీప్ చేస్తూ వైసీపీ జిల్లాలో పాగా వేసింది. ఇక.. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలోనూ టీడీపీ కనీసం గౌరవం కూడా నిలుపుకోలేక పోయింది. మళ్లీ సేమ్ సీన్ రిపీట్…. వైసీపీ జిల్లాను స్వీప్ చేసేసింది. దీంతో పార్టీ పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. అయితే.. పార్టీలో కీలక నేతలు కూడా ముందుకు రావడం లేదు సరికదా… కొందరు ఈ పార్టీలో ఉండి చేసేదేం లేదు.. మన దారి మనం చూసుకుందాం ? అన్న చర్చల్లో బిజీ అయిపోతున్నారు.
అందరి వేళ్లూ ఆయన వైపే….
వీరిలో ఎవరిని కదిలించినా.. అందరి వేళ్లూ అశోక్ గజపతిరాజు వైపు కనిపిస్తున్నాయి. రెండు దశాబ్దాలకు పైగా ఆయన జిల్లా ఇంచార్జ్‌గా చక్రం తిప్పడం.. పెత్తనం చలాయించడం వంటివి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే చాలా మంది నాయకులు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ అశోక్ గజపతిరాజు తన వర్గం నేతల మాట చెల్లుబాటు అయ్యేలా చూసుకున్నారు. అయినా పార్టీ చిత్తుగా ఓడిపోయింది. స్థానిక ఎన్నికలకు ముందే ఆయన్ను పార్టీ బాధ్యతల నుంచి పూర్తిగా పక్కన పెట్టేయాలని ఉన్న డిమాండ్లు ఇప్పుడు మరింత ఊపందుకున్నాయి.
అశోక్ కుమార్తె కూడా….
2019 ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసిన అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి కూడా ఇటీవల కాలంలో యాక్టివ్‌గా లేరు. ఆమె ఇన్చార్జ్గా ఉన్న విజయనగరం కార్పోరేషన్లో సైతం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇక్కడ వైసీపీలో ఉన్న అసమ్మతిని క్యాష్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ కూడా అదితి మిస్ చేసుకున్నారని సొంత పార్టీ నేతలే ఆమెపై గుర్రుగా ఉన్నారు. మరి వీరినే నమ్ముకుని.. వచ్చే ఎన్నికల వరకు కూడా వెయిట్ చేస్తే.. పార్టీ పూర్తిగా పుట్టిమునగడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. ఇక అదితికి విజయనగరంలో బలం లేదని చూపించడంతో పాటు ఈ కుటుంబానికి కనీసం అసెంబ్లీ సీటు కూడా లేకుండా చేసేలా సొంత పార్టీలోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. వీరంతా క్యాస్ట్ ఈక్వేషన్లలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు అక్కడ బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నారు.
ఇప్పటికైనా చంద్రబాబు….
ఇప్పటికే జరిగింది ఎలా ఉన్నప్పటికీ.. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బలమైన బొత్స వర్గాన్ని ధీటుగా ఎదుర్కొనే పటిష్టమైన నాయకత్వాన్ని ఏర్పరుచుకోవాలని తమ్ముళ్ల నుంచి సూచనలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కేఏ. నాయుడు, మీసాల గీతతో పాటు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ నేతలు ఇప్పుడు అశోక్ గజపతిరాజు పెత్తనం జిల్లాలో ఎక్కడా ఉండకూడదన్న డిమాండ్‌ను మరింత స్పీడ్ చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీలోకి చేరతాం అని ఇప్పటికే కొందరు బాహాటంగా చెబుతున్న నేపథ్యంలో వారిని బుజ్జగించాలనే సూచనలు కూడా వస్తున్నాయి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక పూర్తి కాగానే విజయనగరంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా.. అశోక్ గజపతిరాజు కుటుంబం ప్రభ తగ్గినప్పుడు ఇంకా ఆయననే పట్టుకుని వేలాడడం సరికాదని అంటున్నారు పరిశీలకులు.