ఎవరికీ అంత ఈజీ కాదట.. ఎందుకంటే?
కరోనా . . . మానవ జీవన గమనాన్నే మార్చింది. ఇందుకు ఏ దేశం, ఏ రంగం మినహాయింపుకాదు. రాజకీయ రంగం, ఎన్నికల గమనాన్ని కుాడ కరోనా [more]
కరోనా . . . మానవ జీవన గమనాన్నే మార్చింది. ఇందుకు ఏ దేశం, ఏ రంగం మినహాయింపుకాదు. రాజకీయ రంగం, ఎన్నికల గమనాన్ని కుాడ కరోనా [more]
కరోనా . . . మానవ జీవన గమనాన్నే మార్చింది. ఇందుకు ఏ దేశం, ఏ రంగం మినహాయింపుకాదు. రాజకీయ రంగం, ఎన్నికల గమనాన్ని కుాడ కరోనా మార్చగలిగింది. ఇంతటి కరోనా కష్టకాలంలోనుా ఆసియా సంపన్నదేశమైన దక్షిణ కొరియా ఎన్నికల దిశగానే వెళ్ళింది. భౌతిక దురం, శానిటైజర్ల వాడకం, ఆన్ లైన్ ప్రచారం వంటి విధానాలతో విజయవంతంగా ఎన్నికలు నిర్వహించుకుంది. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రమైన బీహార్ కుాడా ఈ దిశగానే సాగనుంది. పేదరాష్ట్రమైన బీహార్ లో వచ్చే అక్టోబరులో అసెంబ్లీ ఎన్నకలు జరగాల్సి ఉంది.
సోషల్ మీడియా ద్వారా…..
యుపీ, మహారాష్ట్ర, తర్వాత అసెంబ్లీ నియెాజకవర్గాలపరంగా(243 స్ధానాలు) పెద్దదైన బీహార్ రాష్ట్రంలో ఇప్పుడే ఎన్నికల సందడి మెుదలైంది. కరోనా సమస్య లేనట్లయితే ఈపాటికే ఎన్నికల ఎత్తుగడలు, వ్వూహరచనలతో పార్టీలు తలమునకలయ్యేవి. కరోనా కారణంగా ఈ ప్రక్రియకు అడ్డకట్ట పడింది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి ప్రజలు బయల పడుతుండటంతో బీహార్ లో ఎన్నికల దిశగా అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఆన్ లైన్, వాట్సప్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ తదితర సామాజిక మధ్యమాల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీలు ప్రయత్నస్తున్నాయి. కరోనా కారణంగా బహిరంగ సభలను రద్దుచేసుకుని పూర్తిగా సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రచారం చేయాలని పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం పార్టీలు ప్రత్యేకగా ఆన్ లైన్ విభాగాలను ఏర్పాటును చేసుకున్నాయి. ఈ విషయంలో బీజేపీ ముందంజలో ఉంది. నితీష్ కుమార్ నాయకత్వంలో జనతాదళ్ (యునైటైడ్), లాలూప్రసాద్ యాదవ్ సారద్యంలోని రాష్ట్రీయ జనతాదళ్, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాసవాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తిపార్టీ, కాంగ్రెస్ పార్టీలు కుాడా ఈ దిశగా చురుగ్గా ప్రయత్నాలు ప్రారంభించాయి.
మిత్రులు శత్రువులు.. శత్రవులు…
అయిదేళ్ళ క్రితం 2015 నాటికి, ఇప్పటికీ రాష్ట్రరాజకీయ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. అప్పటి ప్రత్యర్ధులు ఇప్పుడు మిత్రులయ్యారు. అప్పటి మిత్రులు శత్రువులు అయ్యారు. నాటిఎన్నికల్లో ఆర్జేడీ 80, జనతాదళ్ (యు) 71, బీజేపీ 52, కాంగ్రెస్ 27, ఎల్.జె.పి 2 సీట్లు సాధించాయి. ఆర్.జె.డి కి అత్యధిక స్ధానాలు వచ్చినప్పటికీ ముందస్తు ఒప్పందం మేరకు నితీష్ కుమార్ కు సీ.ఎం పీఠాన్ని అప్పగించింది. 2013 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రం ఘన విజయం సాధించిన నేపద్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనన్న థీమాతో పోరాడిన బీజేపీ కి తలబొప్పి కట్టింది. కేవలం 52 సీట్లకు పరిమితమైంది. ఏడాది అనంతరం ఆర్.జె.డి ని వీడిన నితీష్ కుమార్ బి.జె.పి మద్దతుతో మళ్ళీ సీ.ఎం. అయ్యారు.
కొన్ని విషయాల్లో తేడా ఉన్నప్పటికీ….
అప్పటినుంచి జనతాదళ్ (యు) – బి.జె.పి ఉమ్మడి కాపురం, కొన్ని ఇబ్బందులున్నప్పటికీ సజావుగానే సాగుతోంది. బీజేపీ నేత సుశీల్ కుమార్ మెాదీ కి డిప్యూటీ పదవి అప్పగించి నితీశ్ జాగ్రత్తపడ్డారు. అనంతర కాలంలో జాతీయ పౌరపట్టిక ఎన్.ఆర్.సి జాతీయ జనాభా పట్టిక తదితర విషయల్లో తేడాలు వచ్చినప్పటికీ నితీశ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళతామని కేంద్రహోంమంత్రి అమిత్ షా పేర్నొనడం విశేషం. ఎన్.ఆర్.సి కి వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం గమనార్హం. కొన్ని విషయాల్లో తేడాలు ఉన్నప్పటికీ ఉమ్మడి ప్రత్యర్ధి అయిన లాలూ నాయకత్వంలోని ఆర్జేడీ ని దెబ్బ తీయడానికి కలసి పనిచేయడం తప్పనిసరని రెండు పార్టీలు గ్రహించాయి. కరోనాను ఎదుర్కోవడంలో మెాదీ ముందు జాగ్రత్త చర్యలు, 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీలతో ప్రజల్లోకి వెళ్ళాలని ఇరుపార్టీలు నిర్ణయించాయి.
తేజస్వీ నమ్మకమిదే?
ప్రధాన ప్రతిపక్షమైన ఆర్.జె.డి భారమంతా లాలుా కుమారుడు తేజస్వి యాదవ్ పై పడింది. అవినీతికేసులో తండ్రి లాలుా జైలు పాలువడంతో తేజస్వి అన్ని తానే అయి వ్వవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో తనతో కలసి పోటీ చేసిన కాంగ్రెస్ కు 27 స్ధానాలు వచ్చాయి. ఇప్పుడు కూడా రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయనున్నాయి. గత ఏడాది లోక్ సభ ఎన్నికల ఫలితాలు తేజస్వికి నిరాశను మిగిలించాయి. మెుత్తం 40 స్ధానాలకు కనీసం ఒక్క స్ధానంలోనూ గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ కిషన్ గంజ్ స్ధానాన్ని గెలుచుకుని పరువు కాపాడుకుంది జె.డి (యు) 17, బీజేపీ 16, ఎల్.జె.పి 6, కాంగ్రెస్ ఒక స్ధానం గెలుచుకున్నాయి. అయినప్పటికీ తేజస్వి ధీమాను ప్రదర్శిస్తున్నాయి. నితీష్ అసమర్ధ, అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రజలు తమకే పట్టంకడతారని ఆయన చెబుతున్నారు. ఎన్.ఆర్.సి తో మైనార్టీలు, దళితులు, ఓబీసీలు బీజేపీకి దుారమయ్యారని, కరోనాను ఎదుర్కోవడంలో మెాదీ విఫలమయ్యారని ఇవన్నీ తమకు కలసి వచ్చే అంశాలని ఆయన అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖాండ్, ఢిల్లీ లో తలబొప్పికట్టిన బీజేపీ బీహార్ లో అయినా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. మున్ముందు ఏం జరుగుతుందో చుాడాలి మరి.
-ఎడిటోరియల్ డెస్క్