కరోనా పళనికి కష్టం తెచ్చిపెట్టిందా?
తమిళనాడులో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజుకు వెయ్యి కేసులకు పైగానే నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. తమిళనాడులో కరోనా కేసుల [more]
తమిళనాడులో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజుకు వెయ్యి కేసులకు పైగానే నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. తమిళనాడులో కరోనా కేసుల [more]
తమిళనాడులో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజుకు వెయ్యి కేసులకు పైగానే నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి సామాజిక వ్యాప్తి కారణమని నిపుణుల అంచనా వేస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక ఎమ్మెల్యే కరోనా కారణంగా మృతి చెందడం ఆందోళన కల్గిస్తుంది. డీఎంకే శాసనసభ్యుడు అన్బళగన్ మృతి చెందడం రాజకీయంగా దుమారం రేగుతోంది.
వచ్చే ఏడాది ఎన్నికలు…..
తమిళనాడులో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. డీఎంకే, అధికార అన్నాడీఎంకే ల మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశాలున్నాయి. రజనీకాంత్ పార్టీ ఎంట్రీ ఇస్తే ఎవరికి ఆ దెబ్బ పడుతుందో తెలియని పరిస్థితి. ఎన్నికలు సకాలంలో జరిగితే ఇంకా ఏడాది కూడా సమయం లేదు. దీంతో అన్ని రాజకీయ పక్షాలు కరోనాను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి.
కరోనా వ్యాప్తికి…..
తమిళనాడులో కరోనా వ్యాప్తి చెందడానికి అధికార పార్టీ వైఫల్యమే కారణమని డీఎంకే ఆరోపిస్తుంది. టెస్ట్ లను సక్రమంగా నిర్వహించడం లేదని, కరోనా సోకిన వారిని సకాలంలో గుర్తించడంలోనూ ప్రభుత్వం విఫలమయిందన్న ఆరోపణలతో డీఎంకే రాజకీయంగా అధికార పార్టీని ఇబ్బంది పెడుతుంది. తమిళనాడు ఆర్థికంగా కూడా కరోనా కారణంగా దెబ్బతినింది. దీంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పూర్తిగా పడకేశాయి.
అభివృద్ధి లేకపోవడంతో…..
తమిళనాడులో కోరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 30 వేలు దాటింది. ఒక్క చెన్నై నగరంలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇరవై వేలు దాటింది. దీంతో పళనిస్వామి సర్కార్ పై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. మరోవైపు అన్నాడీఎంకేలో నాయకత్వ సమస్య కూడా ఇబ్బందిగా మారింది. దీంతో వచ్చే ఎన్నికలను కరోనాను డీఎంకే రాజకీయంగా వాడుకుంటోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో కరోనా ప్రభావం తమిళనాడు ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుంది.