క్విట్ టీడీపీ…..ముహూర్తం ఫిక్స్ ?
ఆగస్ట్ నెల అనగానే ఎన్నో గుర్తుకువస్తాయి. అన్నింటికంటే ముందు దేశానికి స్వాతంత్రం తెచ్చిన నెలగా చరిత్రలో చెప్పుకునే సందర్భం ఉంది. ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం అయితే, [more]
ఆగస్ట్ నెల అనగానే ఎన్నో గుర్తుకువస్తాయి. అన్నింటికంటే ముందు దేశానికి స్వాతంత్రం తెచ్చిన నెలగా చరిత్రలో చెప్పుకునే సందర్భం ఉంది. ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం అయితే, [more]
ఆగస్ట్ నెల అనగానే ఎన్నో గుర్తుకువస్తాయి. అన్నింటికంటే ముందు దేశానికి స్వాతంత్రం తెచ్చిన నెలగా చరిత్రలో చెప్పుకునే సందర్భం ఉంది. ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం అయితే, ఆగస్ట్ 8 క్విట్ ఇండియా అంటూ బ్రిటిష్ వారి మీద పోరు చేసిన రోజు. మొత్తానికి ఈ రెండూ స్వేచ్చా వాయువులకు ఊపిరిలూదే మహత్తరమైన డేట్లే. ఈ రెండు డేట్లతో పాటు మరో విషయం ఉంది ఆగస్ట్ నెల టీడీపీ రాజకీయ చరిత్రలో పెను సవాళ్ళకు, సంక్షోభాలకు తెరతీసే నెల. దాంతో ఈ నెల తలచుకోగానే పసుపు గుండె గుభేల్ మంటోంది. అయితే దానికి తగినట్లుగానే పార్టీలో తాజాగా అనేక రాజకీయ పరిణామాలు కూడా చకచకా సాగుతున్నాయి.
ఆగస్ట్ అంటేనే …?
ఆగస్ట్ నెలలో అన్న ఎన్టీఆర్ కి చంద్రబాబు దెబ్బ కొట్టారు, ఇది 1995లో జరిగింది. అంతకు ముంది వెళ్తే 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర రావు కూడా అన్న గారికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఉంది. ఇక 2000 ఆగస్ట్ కూడా చంద్రబాబుకు పొలిటికల్ షాక్ ఇచ్చిన ఏడాదిగా చెప్పుకోవాలి. విద్యుత్ ఉద్యమానికి వామపక్షాలు, కాంగ్రెస్ శ్రీకారం చుడితే ఆ నెల 29న ఉద్యకారులను టీడీపీ సర్కార్ కాల్చిచంపిందన్న విమర్శలు ఎదుర్కొంది. దాని ఫలితంగా కేసీయార్ ఉప సభాపతి పదవికి రాజీనామా చేసి టీడీపీకి పోటీగా టీయారెస్ పెట్టారు. ఆ తరువాత రాజకీయంగా టీడీపీ సర్వం కోల్పోయింది. అందుకే ఆగస్ట్ అంటే టీడీపీకి వెన్నులో వణుకు పుడుతుంది.
తమ్ముళ్ళ క్యూ…
ఇదిలా ఉండగా 2020 ఆగస్ట్ కూడా తెలుగుదేశానికి బాగా గుర్తుండిపోయేలా ఉందిట. పార్టీ పట్ల, బాబు తీరు పట్ల తీవ్ర అసహనంగా ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున వైసీపీ వైపుగా క్యూ కడుతున్నారు. అందులో అతి ముఖ్యుడుగా గంటా శ్రీనివాసరావుని చెప్పుకోవాలి. గంటా వైసీపీలోకి చేరడానికి రెడీ అయ్యారు. ఆయన ఎంచుకుంటున్న డేట్స్ కూడా ఇంటెరెస్టింగ్ గా ఉన్నాయి. అయితే ఆగస్ట్ 8 క్విట్ ఇండియా రోజు అయినా, లేక ఆగస్ట్ 15న అయినా వైసీపీలో చేరాలనుకుంటున్నారుట. ఇది సింబాలిక్ గా ఉంటుందని భావిస్తున్నారుట. ఎందుచేతనంటే క్విట్ టీడీపీ అన్న నినాదం ఇవ్వడం కోసమట. అలాగే స్వాతంత్రం తనకు వచ్చిందని చెప్పుకోవడానికట. ఇక గంటా బాటలో అనేక మంది తమ్ముళ్ళు కూడా నడిచే అవకాశం ఉందని కూడా అంటున్నారు.
ప్రకంపనలే …..
ఇక గంటా వంటి బిగ్ షాట్ టీడీపీని వీడడం అంటే రాజకీయంగా ప్రకంపనలే అంటున్నారు. దానికి తోడు విశాఖలో పరిపాలనా రాజధానిని జగన్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి మద్దతుగా తాను టీడీపీని వీడి వెళ్తున్నానని గంటా గట్టిగా చెబుతారట. అది చంద్రబాబు అమరావతి నినాదానికి అతి పెద్ద బ్రేక్ అనే చెప్పాలి. ఇదే వరసలో మరింతమంది తమ్ముళ్ళు టీడీపీని వీడుతూ బాబు విధానాలను దుయ్యబెడతారుట. ఇవన్నీ చూసుకున్నపుడు కచ్చితంగా మరో ఆగస్ట్ సంక్షోభం టీడీపీలో వస్తుందని అంటున్నారు. జగన్ సైతం మూడు రాజధానులకు మద్దతుగా చాలా ప్లాన్ గా తమ్ముళ్ళ రాకను వాడుకుంటారని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో టీడీపీకి ఈ ఆగస్ట్ నెల అతి పెద్ద దెబ్బ వేయబోతోంది.