అవంతి అందిపుచ్చుకుని… పదిలం చేసుకుని?
అవంతి శ్రీనివాస్ అనుకున్నది సాధించారు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ వైసీపీ హైకమాండ్ కు మోస్ట్ క్రెడిబులిటీ లీడర్ గా మారిపోయారు. అంది వచ్చిన అవకాశాన్ని అవంతి శ్రీనివాస్ [more]
అవంతి శ్రీనివాస్ అనుకున్నది సాధించారు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ వైసీపీ హైకమాండ్ కు మోస్ట్ క్రెడిబులిటీ లీడర్ గా మారిపోయారు. అంది వచ్చిన అవకాశాన్ని అవంతి శ్రీనివాస్ [more]
అవంతి శ్రీనివాస్ అనుకున్నది సాధించారు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ వైసీపీ హైకమాండ్ కు మోస్ట్ క్రెడిబులిటీ లీడర్ గా మారిపోయారు. అంది వచ్చిన అవకాశాన్ని అవంతి శ్రీనివాస్ అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు పార్టీ అధినేత జగన్ వద్ద అవంతి శ్రీనివాస్ వందకు వంద శాతం మార్కులు కొట్టేశారు. కొన్నాళ్ల క్రితం వరకూ అవంతి శ్రీనివాస్ పై వైసీపీ హైకమాండ్ కు చెడు గాని, మంచి అభిప్రాయాలు కానీ లేవు. శాఖాపరంగా కూడా మంత్రి అవంతి పొడిచింది పెద్దగా ఏమీ లేదు. అయినా సామాజికవర్గ పరంగా ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కింది.
బోటు ప్రమాదం తర్వాత….
గోదావరిలో బోటు ప్రమాదం తర్వాత అవంతి శ్రీనివాస్ పదవికే ముప్పు ఏర్పడిందన్న వార్తలు వచ్చాయి. గంటా శ్రీనివాసరావు పార్టీలోకి వస్తారన్న సంకేతాలతో అవంతి శ్రీనివాస్ కు చెక్ పెట్టవచ్చని అధిష్టానం కూడా ఒక దశలో ఆలోచించిందంటారు. అవంతి శ్రీనివాస్ కూడా అధిష్టానం విషయంలో కొంత ఇబ్బంది పడ్డారంటున్నారు. ఎప్పుడైతే మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారో అప్పుడు కూడా అధిష్టానం అవంతి శ్రీనివాస్ కు ఈ విషయంలో పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కన్పించలేదు.
ఎమ్మెల్యేలతో పడక….
అందుకు కారణాలు కూడా లేకపోలేదు. అవంతి శ్రీనివాస్ మిగిలిన ఎమ్మెల్యేలను కలుపుకుని పోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ కు సన్నిహితుడు గుడివాడ అమర్ నాధ్ కు అవంతి శ్రీనివాస్ కు మధ్య విభేదాలు తలెత్తడంతో అధిష్టానం కూడా అమర్ నాధ్ వైపు మొగ్గు చూపిందన్న వార్తలు వచ్చాయి. దీంతో అవంతి శ్రీనివాస్ రెండున్నరేళ్ల తర్వాత అవంతి శ్రీనివాస్ ను మంత్రి పదవి తప్పిస్తారన్న టాక్ కూడా పార్టీలో బలంగా విన్పించింది. టీడీపీ నుంచి రావడంతో సహజంగానే అవంతి శ్రీనివాస్ పై కొంత నెగిటివ్ థింకింగ్ ఉండటం సహజమే. టీడీపీకి ధీటుగా జవాబు చెప్పడంలో ఈ మధ్య కాలంలో అవంతి శ్రీనివాస్ ముందుంటున్నారు.
తాజా ఘటనతో…..
అయితే తాజా పరిణామంతో అవంతి శ్రీనివాస్ జగన్ వద్ద మంచి మార్కులు కొట్టేశారు. జగన్ కోరికను ఒకరకంగా అవంతి శ్రీనివాస్ తీర్చేసినట్లేనంటున్నారు. చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకోవడంలో అవంతి శ్రీనివాస్ వ్యూహం ఫలించిందంటున్నారు. ఎయిర్ పోర్టు వద్ద ఉన్న వారంతా అవంతి శ్రీనివాస్ సహచరులే కావడంతో ఆయన రేంజ్ వైసీపీ హైకమాండ్ వద్ద అమాంతంగా పెరిగందంటున్నారు. జగన్ ను నిలువరించిన అదే ఎయిర్ పోర్టులో చంద్రబాబును అడుగుపెట్టనివ్వకుండా అవమానించి వెనక్కు పంపినందుకు అవంతి శ్రీనివాస్ పదవి పదిలమేనన్న టాక్ పార్టీలో విన్పిస్తుంది.