అవంతిని మంత్రిగా గుర్తించరట
మంత్రి పదవి అన్నది హోదా కోసం, తనను అందరూ గుర్తించాలని ఆరాటం కోసం. అధికారం చలాయించాలన్న ఉబలాటం కోసం. అటువంటి మంత్రి పదవి కోసం ఏళ్ళకు ఏళ్లు [more]
మంత్రి పదవి అన్నది హోదా కోసం, తనను అందరూ గుర్తించాలని ఆరాటం కోసం. అధికారం చలాయించాలన్న ఉబలాటం కోసం. అటువంటి మంత్రి పదవి కోసం ఏళ్ళకు ఏళ్లు [more]
మంత్రి పదవి అన్నది హోదా కోసం, తనను అందరూ గుర్తించాలని ఆరాటం కోసం. అధికారం చలాయించాలన్న ఉబలాటం కోసం. అటువంటి మంత్రి పదవి కోసం ఏళ్ళకు ఏళ్లు అర్రులు చాచి తీరా సంపాదించాక ఇలాంటి షాకింగ్ స్టేట్ మెంట్స్ వింటే ఎవరికైనా ఏమనిపిస్తుంది. ఇపుడు విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు పరిస్థితి అలాగే ఉంది. ఆయన మంత్రి పదవి కోసమే మూడు పార్టీలు మారి మరీ తన చిరకాల కోరిక తీర్చుకున్నాడు. ఇపుడు ఎవరి మీదనైతే తన దర్పం చూపిద్దామనుకున్నారో వారే నిన్ను అసలు పట్టించుకోమని చెప్పేస్తే ఇక అవంతి శ్రీనివాసరావు పరిస్థితి ఎలా ఉంటుంది. ఇలా పార్టీ మారి అలా మంత్రి అయిపోయిన అవంతి శ్రీనివాసరావుకి ఇపుడు పదవి ఉన్నా ఆ హాట్ స్టేట్మెంట్స్ తో ఏదో తెలియని బాధ పట్టిపీడిస్తోందట. అమాత్యుడన్న ఆనందం కూడా అవిరి అయిందట. ఇంతకీ అవంతి శ్రీనివాసరావును మంత్రిగా కూడా గుర్తించనని అన్నదెవరు.
నిన్నటి స్నేహితుడేగా ….
అవంతి శ్రీనివాసరావు ఎక్కడ నుంచో రాలేదు. ఆ మాజీ మంత్రి శిబిరం నుంచే వచ్చారు. విశాఖ జిల్లా రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం ఒకనాడు చలాయించి ఇప్పటికీ తనదైన ముద్ర వేసుకున్న గంటా శ్రీనివాసరావు బెస్ట్ దోస్త్ గా అవంతి శ్రీనివాసరావు కొన్ని నెలల ముందు వరకూ ఉన్నారు. ఇద్దరిదీ సుదీర్ఘమైన స్నేహం. రాజకీయాలు చిచ్చు పెట్టకపోయి ఉంటే ఇంకా అలాగే ఉండేదేమో కానీ, నాలుగు నెలల క్రితం టీడీపీ నుంచి వైసీపీలోకి ఒక్కసారిగా దూకేశారు. అది కూడా ముందుగా అనుకున్న ప్లాన్ నుంచి కాదని తనకు తానుగా బయటకు వచ్చేశారని ఇప్పటికీ ప్రచారంలో ఉంది. దాంతో గంటాకు గుస్సా వచ్చింది. అంతా అనుకుని ఒకేసారి పార్టీ మారాలన్న మిత్రుల కధను మలుపు తిప్పేసి అవంతి శ్రీనివాసరావు ఒక్కడే వైసీపీ వైపు రావడంతో జిల్లాలో రాజకీయమే మారిపోయింది. దాంతో ఇద్దరి మధ్య మిత్రత్వం స్థానంలో శత్రుత్వం ఏర్పడింది. అది భారీ ఎత్తున మాటల యుధ్ధానికి దారి తీస్తోంది.
ఆయనను మంత్రిగా గుర్తించను…
గంటా శ్రీనివాసరావు ఏడేళ్ళకు పైగా కాంగ్రెస్, టీడీపీలలో మంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ మారితే మంత్రి అయ్యేవారే. కానీ అవంతి శ్రీనివాసరావు ఆ ప్లేస్ లోకి రావడం వల్ల గంటా ప్లాన్ మారిపోయి ఖాళీ అయిపోయారు. ఆ కోపం అలా ఉండగానే తాజాగా గంటా మీద అవంతి శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోకి గంటా రావాలనుకున్నా జగన్ ఎపుడో గేట్లు మూసేశారని అవంతి శ్రీనివాసరావు పక్కా క్లారిటీగా చెప్పేశారు. గంటాకు వైసీపీలో నో ఛాన్స్ అని కూడా మాట్లాడారు. దానికి రిటార్ట్ అన్నట్లుగా గంటా కూడా గట్టిగానే మాట్లాడారు. అసలు ఆయన్ని తాను మంత్రిగా గుర్తించను అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అసలు అతను మంత్రిగా నేను పట్టించుకుంటే కదా అంటూ బోల్డ్ గా గంటా అన్న మాటలు అవంతి శ్రీనివాసరావు కి ఎక్కడో తగిలాయి. మొత్తానికి ఇద్దరు మిత్రుల మధ్య సాగుతున్న మాటల యుధ్ధం మునుముందు ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.