వైసీపీలో పెద్ద తలకాయ పనేనా ?
విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ మీద రాసలీలల ఆరోపణలు రావడం పట్ల ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. అవంతి శ్రీనివాస్ అంటే విశాఖలో రాజకీయాలకు అతీతంగా [more]
విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ మీద రాసలీలల ఆరోపణలు రావడం పట్ల ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. అవంతి శ్రీనివాస్ అంటే విశాఖలో రాజకీయాలకు అతీతంగా [more]
విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ మీద రాసలీలల ఆరోపణలు రావడం పట్ల ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. అవంతి శ్రీనివాస్ అంటే విశాఖలో రాజకీయాలకు అతీతంగా అందరికీ ఒక గౌరవం ఉంది. ఆయన పెద్ద మనిషి అని పేరు. ఆయన మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఇప్పటివరకూ లేరు. ఆయన చాలా తక్కువ స్థాయి నుంచి కష్టపడి ఈ ఉన్నత స్థితికి చేరుకున్నారు. అటువంటి అవంతి శ్రీనివాస్ దైవ భక్తుడు కూడా. ఆయన ఠంచనుగా ప్రతీ శనివారం సింహాచలం అప్పన్న స్వామి దర్శనం చేసుకోకుండా ఇంటికి వెళ్లరు. ఇలా నియమాలు, నిష్టలు ఆయనకు ఎన్నో ఉన్నాయి.
గురి పెట్టింది ఎవరు ..?
అవంతి శ్రీనివాస్ లాంటి సాధుజీవి మీద గురి పెట్టింది ఎవరు అన్నదే ఇపుడు చర్చ. నిజానికి అవంతికి బయట కూడా ఎవరూ శత్రువులు లేరు. ఆయన అందరితోనూ మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తారు. ఇక ఆయన రాజకీయ గురువు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కూడా రాజకీయ పరమైన విభేదాలు తప్ప వ్యక్తిగతంగా లేవు అంటారు. మరి ఇంతలా స్నేహశీలిగా ఉన్న అవంతి శ్రీనివాస్ మీద గురి పెట్టింది ఎవరూ అన్న చర్చ అయితే వస్తోంది. అయితే అవంతి మాటలు చూసిన ఆయన అనుచరుల వేదన చూసిన కుట్ర అనేది స్వపక్షంలోనే జరిగింది అంటున్నారు.
ఎవరా పెద్ద మనిషి ….?
అవంతి శ్రీనివాస్ రాజకీయానికి మొదటి నుంచి పార్టీలోనే బ్రేకులు వేసేవారు ఉన్నారని అంటున్నారు. ఆయన విశాఖ వంటి పెద్ద జిల్లాకు ఏకైక మంత్రిగా ఉన్నారు. అంతే కాదు భీమిలీ వంటి కీలకమైన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఈ రెండే ఆయనకు శత్రువులను కొనితెచ్చాయా అన్న మాట కూడా వినిపిస్తోంది. అవంతి శ్రీనివాస్ మంత్రిగా సొంతంగా ఉండాలనుకున్నారు. దాంతో కొంతమందికి ఇబ్బందిగా ఉందని కూడా చెబుతారు. ఆయన తన గురువు గంటా మాదిరిగా జిల్లాలో చక్రం తిప్పాలి అనుకుంటే అవరోధాలు కలిగించిన వారూ ఉన్నారని అంటారు. మరి అలా చూసుకుంటే ఈ పని ఎవరు చేశారు. ఆడియో లీకులు చేసి ఎవరు బురద జల్లారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది.
హుందాగా ఉండాల్సింది…
ఎటూ అవంతి శ్రీనివాస్ మంత్రిగా మరో రెండున్నరేళ్ళు కంటిన్యూ అవుతారు అని ఎవరూ గట్టిగా చెప్పడంలేదు. మరి కొద్ది నెలలలో ఆయన మాజీ అవుతారనే అంతా అంటున్నారు. అలాంటిది చివరి రోజులలో ఈ మచ్చ పడడంతోనే ఆయన రగిలిపోతున్నారు అంటున్నారు. జగన్ విశాఖలో మరొకరికి చాన్స్ ఇస్తారని అంతా అనుకుంటున్నదే. ఆ మాత్రం భాగ్యానికి ఇపుడు అవంతి శ్రీనివాస్ ని బ్యాడ్ చేస్తే ఎవరికి మేలు అన్న చర్చ కూడా సాగుతోంది. అంటే మంత్రి పదవి నుంచి ఆయన్ని తప్పించడం కాదు, ఏకంగా ఎమ్మెల్యే టికెట్ కే ఎసరు పెట్టేలాగానే ఈ కుట్ర సాగింది అంటున్నారు. మొత్తానికి చూస్తే అవంతి శ్రీనివాస్ ఇపుడు రాజకీయంగా గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు అనుకోవాలేమో. మరి ఈ విషయంలో జగన్ రియాక్షన్ తెలిస్తే తప్ప మంత్రి గారు కుదుట పడలేరు అంటున్నారు.