ఇలా భయపడిపోతున్నాడేంటబ్బా
రాజకీయ నాయకులకు అభద్రతాభావం ఉండడం సహజం. పొజిషన్ పెరిగినపుడు దానితో పాటే అనుమానాలు పెరిగిపోతాయి. తాడుని చూసి పాము అనుకుంటారు. మిత్రుడెవరో శత్రువెవరో కూడా తెలియకుండా ఉంటారు. [more]
రాజకీయ నాయకులకు అభద్రతాభావం ఉండడం సహజం. పొజిషన్ పెరిగినపుడు దానితో పాటే అనుమానాలు పెరిగిపోతాయి. తాడుని చూసి పాము అనుకుంటారు. మిత్రుడెవరో శత్రువెవరో కూడా తెలియకుండా ఉంటారు. [more]
రాజకీయ నాయకులకు అభద్రతాభావం ఉండడం సహజం. పొజిషన్ పెరిగినపుడు దానితో పాటే అనుమానాలు పెరిగిపోతాయి. తాడుని చూసి పాము అనుకుంటారు. మిత్రుడెవరో శత్రువెవరో కూడా తెలియకుండా ఉంటారు. అసహనం పాలు కూడా ఎక్కువ అవుతుంది. బాధ్యతల వల్ల వత్తిళ్ళు ఉంటాయి, వాటిని సైతం భరించలేని స్థితికి వచ్చేస్తారు. విశాఖ జిల్లాకు చెందిన ఏకైన మంత్రి అవంతి శ్రీనివాసరావు పరిస్థితి ఇపుడు అలాగే ఉంది. అవంతి శ్రీనివాసరావుకు జగన్ జాక్ పాట్ ఇచ్చేశారు. తక్కువలో తక్కువ రెండున్నరేళ్ల పాటు మంత్రి పదవిలో ఉంటానని ప్రమాణం చేసినపుడు అవంతి శ్రీనివాసరావు భావించారు. అయితే నాలుగు నెలల పరిణామాలు మాత్రం ఏకంగా మినిస్టర్ గారినే డౌట్లో పెట్టేస్తున్నాయి. శాఖాపరంగా పనితీరులో మెరుగుదల లేదు. రాజకీయంగా దూకుడు అంతకంటే లేదు. జిల్లాలో పట్టు పెంచుకోలేదు. పార్టీని ముందుకు నడిపించిన దాఖలాలు లేవు. ఇన్ని మైనస్ లకు తోడు ఇతర పార్టీల నుంచి నాయకులు వచ్చేస్తారామోనని కంగారు. మొత్తానికి మంత్రి అవంతి శ్రీనివాసరావులో అభద్రతాభావం ఒక్కసారిగా పెరిగిపోతోంది.
గంటా గురించే చింత….
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీదనే మంత్రి అవంతి శ్రీనివాసరావు గురి అంతా పెట్టేశారు. ఆయన ఊసు, ధ్యాస అంతా కూడా మాజీ మంత్రి గురించే. ఆయన కదలికలనే గమనిస్తూ పొద్దు పుచ్చుతున్నారు. గంటా ఎప్పటికైనా వైసీపీ గూటికి చేరుతారమేనని ఆందోళన అవంతి శ్రీనివాసరావులో ఉంది. దాంతో పాలనను పక్కన పెట్టేసి మరీ కెమెరా కళ్ళూ అన్నీ గంటా మీదనే పెట్టేశారు. గంటా వైసీపీలో చేరితే తనకు రాజకీయంగా ఇబ్బందేనని అవంతి శ్రీనివాసరావు భయపడుతున్నారని భోగట్టా. ఎంతైనా ఇద్దరూ ఒకే పార్టీలో పనిచేసిన వారు కావడంతో మాజీ మంత్రి సామర్ధ్యం అవంతి శ్రీనివాసరావుకి బాగా తెలుసు అని అంటున్నారు. దాంతో చీటికి మాటికీ మాజీ మంత్రి ప్రస్తావన తెచ్చి విమర్శలు చేస్తున్నారు.
అనవసర వివాదాలు….
అవంతి శ్రీనివాసరావుకి ఇపుడు వైసీపీ నేతలు ఎవరిని చూసినా ఏదోలా ఉందేమో తెలియదు కానీ అందరితోనూ వివాదాలు పెట్టుకుంటున్నారని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా ఉన్న ద్రోణంరాజు శ్రీనివాస్ తో మంత్రి అవంతి శ్రీనివాసరావు వివాదం తెచ్చుకోవడాన్ని అంతా తప్పు పడుతున్నారు. వివాదరహితునిగా సౌమ్యునిగా ఉన్న ద్రోణంరాజు తో గొడవ వచ్చిదంటే అవంతి శ్రీనివాసరావు ఎంతలా కలవరపడుతున్నారో అర్ధమవుతోందంటున్నారు. ఇక ఎమ్మెల్యేలు సైతం అవంతి శ్రీనివాసరావుకి దూరంగానే ఉంటున్నారు. చిత్రంగా అధికారులు సైతం మంత్రిగారికి చాలా ఎడం పాటిస్తున్నారు. గతంలో తెల్లారిలేస్తే గంటా ఇంట్లో ప్రత్యక్షం అయ్యే అధికారులు అవంతి శ్రీనివాసరావు వైఖరి కారణంగా ఎందుకొచ్చిన తంటా అనుకుంటున్నారట. ఇలా అందరితో సఖ్యత కొరవడి అనుమానపడి అవమానపడుతున్న అమాత్యునిగా అవంతి శ్రీనివాసరావు విశాఖ జిల్లాలో మిగిలారు. దీనికి సంబంధించిన నివేదికలు ఎప్పటికపుడు ముఖ్యమంత్రి జగన్ వద్దకు చేరుతున్నాయట. చూడాలి ఏం జరుగుతుందో.