బాగా ముదిరిపోయారే….!!
మంత్రి అవంతి శ్రీనివాసరావు చూడడానికి మెత్తగా ఉంటాడు కానీ ఆయన దూకుడే వేరు. తనకేం కావాలో బాగా తెలుసు. ఎలా సాధించుకోవాలో ఇంకా బాగా తెలుసు. పదేళ్ల [more]
మంత్రి అవంతి శ్రీనివాసరావు చూడడానికి మెత్తగా ఉంటాడు కానీ ఆయన దూకుడే వేరు. తనకేం కావాలో బాగా తెలుసు. ఎలా సాధించుకోవాలో ఇంకా బాగా తెలుసు. పదేళ్ల [more]
మంత్రి అవంతి శ్రీనివాసరావు చూడడానికి మెత్తగా ఉంటాడు కానీ ఆయన దూకుడే వేరు. తనకేం కావాలో బాగా తెలుసు. ఎలా సాధించుకోవాలో ఇంకా బాగా తెలుసు. పదేళ్ల రాజకీయానికే ముదిరిపోయిన ఈ వైసీపీ మంత్రి ఎక్కడైనా, ఎపుడైనా బస్తీ మే సవాల్ అంటారు. తన రాజకీయ సహచరుడు గంటా శ్రీనివాసరావు నే సవాల్ చేసి ఆయన నోరు నొక్కేసిన ఘనాపాటి. ఇక ఎప్పటికి ఏది అవసరమో తెలుసుకుని మసలుకునే రాజకీయ నేత కూడా ఆయనే. అందుకే అవంతి ఇపుడు మరో గంటా అయిపోయారు. విశాఖ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పేస్తున్నారు. విశాఖ జిల్లాకు ఏకైక మంత్రిగా ఉండడం కూడా ఆయనకు కలసివస్తోంది. ఇదిలా ఉండగా అవంతి తాజాగా తన విశ్వరూపం బయటపెట్టేసరికి షాక్ తీనడం అందరి వంతైంది.
నక్సలైట్ ని కావాల్సిన వాడిని….
తాను రాజకీయాల్లోకి రాకుండా ఉండి ఉంటే నక్స్లలైట్ ని అయ్యేవాడిని అంటూ ఫ్లాష్ బ్యాక్ కధలను మంత్రి అవంతి వినిపిస్తున్నారు. తనను మించిన మొనగాడు లేడు, తన వద్దే కుప్పిగెంతులా అంటూ అవంతి గర్జిస్తున్నారు. అవంతి తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళినపుడు పద్మనాభ మండలంలో కొందరు ఆందోళకారులు అక్కడ ఓ కంపెనీని ఎత్తివేయమంటూ ప్లే కార్డులు ప్రదర్శించారు. అవంతిని బాగా విసిగించారు. దాంతో మంత్రికి ఒక్కసారిగా పూనకం వచ్చేసింది. అసలు నేనేంటో తెలుసా మీకు, నా వద్దనే మీ ఆటలా అంటూ ఓ రేంజిలో రెచ్చిపోయారు. నేను రాజకీయాల్లొకి రాకముందు నక్సలైట్ అవుదామనుకున్నానని నిజం చెప్పేశారు. ఇక్కడ పోలీసులు ఉన్నారు చెప్పకూదంటూనే అవంతి తాను నక్సలైట్ అవ్వాల్సిన వాడినంటూ చెప్పుకున్నారు. అంటే అంత డేరింగ్, మొండితనం, తెగువ తనకు ఉన్నాయని ఆయన బెదిరించారన్నమాట. మరి ఎందుకు ఇలా రాజకీయాల్లోకి వచ్చారో అది కూడా ఆయనే చెబితే బాగుంటుందేమో.
అందరి జాతకాలూ తెలుసు……
ఇక తనను అడ్డుకున్నది టీడీపీ వాళ్లేనని మంత్రి గారి నమ్మకం. దాంతో వారిని ఉద్దేశిస్తూ అయిదేళ్ళ పాటు ఏమీ చేయలేకపోయారు. ఇపుడు మాత్రం అన్నీ నేనే చేయాలా, నన్ను బదనాం చేద్దామనుకుంటే జాతకాలు అన్నీ బయటపెడతా అంటూ హెచ్చరించారు. మొత్తానికి అవంతిలోని మరో మనిషిని చూసిన వారంతా అమ్మో అనుకోవాల్సివచ్చింది. ఇదిలా ఉండగా గంటా పూర్వాశ్రమంలో ప్రజారాజ్యం ఎమ్మెల్యే, అక్కడ యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ ఉండేవారు. ఆయన సైతం జనసేనానిగా అవతారం ఎత్తినపుడు పలు మీటింగుల్లో మాట్లాడుతూ తాను నక్సలైట్ అవుదామని అనుకున్నానని చెప్పేవారు. మన అవంతి వారి మీద పవన్ ప్రభావం ఏమైనా పడిందా ఏమిటి అని కూడా చర్చించుకుంటున్నారు. . మొత్తానికి నక్స్లలైట్లను కూడా రాజకీయాలకు ఇలా వాడేసుకోవచ్చన్నమాట.