అయ్యన్న మారడంతే ?
విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం నేత. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అటు సొంతపార్టీకి ఇటు అనుచరులకూ రాను రాను ఇబ్బందిగా మారిపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. [more]
విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం నేత. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అటు సొంతపార్టీకి ఇటు అనుచరులకూ రాను రాను ఇబ్బందిగా మారిపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. [more]
విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం నేత. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అటు సొంతపార్టీకి ఇటు అనుచరులకూ రాను రాను ఇబ్బందిగా మారిపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. అయ్యన్నపాత్రుడు వయసు ఇపుడు అరవై అయిదేళ్ళు. అయినా కానీ ఆయన దూకుడు ఎక్కడా ఆగలేదు. ఆయన పాతికేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీయార్ కబురు మీద ఆయన పెద్దాయని కలసుకున్నారు. అప్పటికి ఆయన తాత లచ్చాపాత్రుడు నర్శీపట్నంలో సర్పంచ్ గా మంచి బలమైన బీసీ నేతగా ఉండేవారు. తంగేడు రాజులు కాంగ్రెస్ తరఫున ఉండేవారు. వారికి ఎదురొడ్డి నిలిచింది అయ్యన్నపాత్రుడు తాత మాత్రమే. దాంతో ఎన్టీయార్ కన్ను పడింది.
బంపర్ ఆఫర్ …
తన తాతకు వయోభారం, అనారోగ్యం వంటి కారణాలు అన్నగారికి అయ్యన్నపాత్రుడు వివరించడంతో నీవే పోటీ చేయ్ అంటూ పాతికేళ్ల వయసున్న అయ్యన్నపాత్రుడికి టికెట్ అన్నగారు ఇచ్చారు. అయ్యన్నకు అప్పటికి రాజకీయాల్లోకి రావాలని ఉందో లేదో తెలియదు. పైగా ఎమ్మెల్యే కావాలంటే అరవయ్యేళ్ళు ఉండాలని కాంగ్రెస్ కల్చర్ పెట్టిన రూల్. దాంతో సగం కూడా ఏజ్ లేని అయ్యన్నకు ఎన్టీయార్ టికెట్ ఇవ్వడం అంటే బంపర్ ఆఫరే. దాంతో ఆయన ఎమ్మెల్యే అయిపోయారు. ఆ దూకుడుతనం ఆయనను ఇప్పటికీ వదలడంలేదు.
బాబు కంటే….
ఇక చంద్రబాబు కాంగ్రెస్ లో ఉన్నపుడు అయ్యన్నపాత్రుడు టీడీపీలో ఉన్నారు. ఎన్టీయార్ కి బాగా నచ్చేశాడు. అందుకే ఆయన్ని 1985లో మళ్ళీ అధికారంలోకి వచ్చాక సాంకేతిక శాఖామంత్రిగా నియమించారు. అంటే 27 ఏళ్ళకే మినిస్టర్ అన్నమాట. ఆ గెలుపు, పొగరు ఇప్పటికీ అయ్యన్నపాత్రుడు లో అలాగే ఉన్నాయని అంటారు. అయ్యన్నకు జోరు ఎక్కువ. ఆయన పల్లెటూరి రాజకీయం చేస్తారు. ప్రేమగా కూడా ఉంటారు. అదే సమయంలో కోపం వస్తే ఒళ్ళూ పై తెలియదు. ఎంతవారు అయినా నోటి వెంట మాటలు దారుణంగా వచ్చేస్తాయి. అదే అయ్యన్నపాత్రుడికి ఎన్నోసార్లు మైనస్ అయింది.
మాస్ లీడర్ గా…..
నిజానికి అయ్యన్నపాత్రుడు కీలకమైన శాఖలు ఎన్నో చేసి టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నారు. ఆయన ఒకసారి ఎంపీగా కూడా పనిచేశారు. అటువంటి అయ్యన్నపాత్రుడి పేరుని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవికి బాబు పరిశీలించకపోవడానికి ఆయనకు ఉన్న అతి ఆవేశమే కారణమని అంటారు. అదే విధంగా అయ్యన్నపాత్రుడిని డిప్యూటీ సీఎం చేయాలనుకున్నా దూకుడుతో ఏం చేస్తారోనని కూడా బెదురుతో పక్కన పెట్టారని అంటారు. ఇక అయ్యన్నది ముక్కుసూటితనం. ఆయన రాజకీయం కూడా భిన్నంగా ఉంటుంది. అయితే ఇపుడు కాలం మారింది. పార్టీ కూడా ఇబ్బందులో ఉంది. అయినా సరే అయ్యన్నపాత్రుడు మారలేకపోతున్నారు. ఆయన యువ ఎమ్మెల్యేగా ఉన్నపుడే ఒక పోలీస్ అధికారిని కొట్టారని పేరు వచ్చింది. ఇపుడు అరవైఏళ్ల వయసులో కూడా ఆయన అదే చేస్తున్నారు అంటున్నారు. ఒక మహిళ అని చూడకుండా మునిసిపల్ కమిషనర్ మీద నోరు పారేసుకున్నారు. ఇపుడు అయ్యన్నపాత్రుడు చిక్కుల్లో పడ్డారు. ఆయన ఇలా తరచూ వైసీపీకి దొరికిపోయి ఏడాదిలోనే ఏడు కేసులల్లో బుక్ అయ్యారంటే ఆయన మారరు అని అర్ధం చేసుకోవాలేమో.