ఫ్యామిలీ స్ట్రోక్తో అయ్యన్న విలవిలా ?
ఆయన టీడీపీలో ఓ సీనియర్ నేత… మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చక్రం తిప్పారు. రాజకీయంగా ఎంతో మంది ఉద్దండులను అటు ప్రత్యర్థి [more]
ఆయన టీడీపీలో ఓ సీనియర్ నేత… మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చక్రం తిప్పారు. రాజకీయంగా ఎంతో మంది ఉద్దండులను అటు ప్రత్యర్థి [more]
ఆయన టీడీపీలో ఓ సీనియర్ నేత… మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చక్రం తిప్పారు. రాజకీయంగా ఎంతో మంది ఉద్దండులను అటు ప్రత్యర్థి పార్టీల్లోనూ.. ఇటు సొంత పార్టీలోనూ ఎదుర్కొన్నారు. అలాంటి నేతకు ఇప్పుడు సొంత ఫ్యామిలీ నుంచే స్ట్రోక్ తప్పడం లేదు. ఆయన కూడా టీడీపీ అధినేత చంద్రబాబులా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనే. ఆ నేత ఎవరో కాదు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. మొత్తం తొమ్మిది సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఆరుసార్లు గెలిచిన ఆయన ఎన్నో కీలకమైన మంత్రిత్వ శాఖలు కూడా చేపట్టారు. ఇక టీడీపీలోనే రాజకీయ అత్యున్నత రాజకీయ వ్యవహారాల కమిటీ అయిన పోలిట్ బ్యూరోలో సైతం ఆయన మెంబర్గా ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు.
కంచుకోటగా మార్చడంలో….
నర్సీపట్నంను టీడీపీకి కంచుకోటగా మార్చడంలో అయ్యన్నదే కీలక పాత్ర. అలాంటి అయ్యన్నపాత్రుడు గత ఎన్నికల్లో తన రాజకీయ శిష్యుడు అయిన పెట్ల ఉమాశంకర్ గణేష్ చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. అయ్యన్న మూడు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఇంత ఘోర ఓటమిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నర్సీపట్నంలో ఆయన్న కంచుకోటలు కూలిపోతున్నాయి. పలువురు కీలక నేతలు పార్టీ మారిపోయారు. ఇక అయ్యన్నపాత్రుడు సోదరుడే స్వయంగా వైసీపీలోకి వెళ్లిపోయారు. తాజా పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ ఎక్కువ పంచాయతీల్లో పాగా వేసింది. ఇక ఇప్పుడు నర్సీపట్నం మునిసిపాల్టీకి జరుగుతోన్న ఎన్నికలు ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.
సోదరుడు వెళ్లిపోయినా….?
వచ్చే ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు పోటీ చేయడం అనుమానమే. ఆయన వారసుడు విజయ్ వచ్చే ఎన్నికల బరిలో ఉండడం ఖాయమే. ఇక అయ్యన్న తన సత్తా ఫ్రూవ్ చేసుకునేందుకు ఇవే ఆఖరు ఎన్నికలు అంటున్నారు. నర్సీపట్నం మునిసిపాల్టీలో పాగా వేసి సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. ఇక ఆయనకు గత కొన్నేళ్లుగా వెన్నుదున్నుగా ఉంటోన్న ఆయన సోదరుడు, నర్సీపట్నం మాజీ మునిసిపల్ చైర్మన్ సన్యాసి పాత్రుడు తన వర్గంతో సహా వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇది ఆయనకు పెద్ద దెబ్బే.
పోరు రసవత్తరమే….
గత ప్రభుత్వంలో మునిసిపల్ చైర్మన్గా సన్యాసిపాత్రుడు ఉన్నా కూడా మున్సిపాల్టీలోనూ అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ జోక్యం ఎక్కువుగా ఉండడంతో సన్యాసిపాత్రుడు అనేక అవమానాలు ఎదుర్కొని పార్టీ వీడిపోయారు. స్థానికంగా ఆయనకంటూ ఓ వర్గం ఉంది. దీంతో ఆయన మున్సిపల్ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా గట్టి పోటీ తప్పేలా లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అవుతోన్న అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ మున్సిపాల్టీలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు. అయితే యువ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మరోసారి అయ్యన్న ఫ్యామిలీని ఓడించి.. తన సత్తా చాటుకోవాలని చూస్తుండడంతో నర్సీపట్నం మునిసిపోల్ పోరు రసవత్తరంగా మారింది.