అయ్యన్న తమ్ముడికి ఎమ్మెల్సీ… ?
రాజకీయాల్లో లెక్కలు చూసుకోవాలి. ఎవరి మీద ఎవరిని ప్రయోగించాలో చూసుకుంటే చాలు లక్ష్యాన్ని ఛేదించినట్లే. విశాఖ జిల్లాలో అలా చూసుకుంటే కనుక టీడీపీకి పెద్ద దిక్కుగా మాజీ [more]
రాజకీయాల్లో లెక్కలు చూసుకోవాలి. ఎవరి మీద ఎవరిని ప్రయోగించాలో చూసుకుంటే చాలు లక్ష్యాన్ని ఛేదించినట్లే. విశాఖ జిల్లాలో అలా చూసుకుంటే కనుక టీడీపీకి పెద్ద దిక్కుగా మాజీ [more]
రాజకీయాల్లో లెక్కలు చూసుకోవాలి. ఎవరి మీద ఎవరిని ప్రయోగించాలో చూసుకుంటే చాలు లక్ష్యాన్ని ఛేదించినట్లే. విశాఖ జిల్లాలో అలా చూసుకుంటే కనుక టీడీపీకి పెద్ద దిక్కుగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన టీడీపీ పుట్టిన నాటి నుంచి కొనసాగుతున్నారు. చంద్రబాబుకు, లోకేష్ బాబుకు కూడా నమ్మిన బంటు. తెల్లారి లేచింది మొదలు జగన్ మీద విమర్శలతో విరుచుకుపడిపోతారు. పాతికే వేల ఓట్ల తేడాతో ఓడినా కూడా అయ్యన్నపాత్రుడు దూకుడు ఎక్కడా తగ్గడంలేదు. దాంతో అయ్యన్నపాత్రుడుని పొలిటికల్ గా కంట్రోల్ చేయాలని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు.
ఆయన విభీషణుడే…?
లంక గుట్టు విభీషణుడికి ఎరుక అని చెబుతారు. అలాంటి విభీషణుడు రాముడి శిబిరంలో చేరడంతోనే విజయం సిద్ధించింది అని కూడా అంటారు. అలా అన్న చాటు తమ్ముడిగా రాజకీయంగా ఎదిగిన చింతకాయల సన్యాసిపాత్రుడు సరైన టైమ్ చూసి వైసీపీలోకి జంప్ చేశారు. ఆయన రాకతోనే అయ్యన్నపాత్రుడు ఓటమి ఖాయమైందని కూడా అంతా భావించారు. అనుకున్నట్లుగానే అయ్యన్నపాత్రుడు ఓడారు, అది కూడా భారీ తేడాతో పరాజయం పలుకరించింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ మధ్య జరిగిన నర్శీపట్నం మునిసిపాలిటీ ఎన్నికలో కూడా వైసీపీ జెండా రెపరెపలాడడం వెనక సన్యాసిపాత్రుడి పాత్ర ఉందని అంటారు.
ఆ హామీ అలా …?
ఇదిలా ఉంటే సన్యాసిపాత్రుడు వైసీపీలోకి చేరినపుడు ఎమ్మెల్యే టికెట్ నే ఆశించారు అని చెబుతారు. అయితే అప్పటికే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇంచార్జిగా ఉన్నారు. పైగా ఆయన జగన్ కి అత్యంత సన్నిహితుడు. ఆయన్ని కాదని చివరి నిముషంలో వచ్చిన సన్యాసిపాత్రుడికి టికెట్ ఇవ్వడం అన్నది కుదిరే పని కాదు. దాంతో ఆయనకు ఎమ్మెల్సీ హామీని పార్టీ ఇచ్చిదని చెబుతారు. ఆ కారణంగానే సన్యాసిపాత్రుడు ఇంతకాలం పార్టీని కనిపెట్టుకుని ఉన్నారు. ప్రతీ విజయం వెనక తన పాత్రను రుజువు చేసుకుంటున్నారు. సీనియర్ మోస్ట్ లీడర్ గా, అతి పెద్ద రాజకీయ కుటుంబానికి చెందిన నేతగా సన్యాసిపాత్రుడికి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే అని ఆయన అనుచరులు కూడా అంటున్నారు.
కధే వేరుగా…?
వైసీపీకి మరో పదకొండు ఎమ్మెల్సీలను తొందరలోనే భర్తీ చేసే చాన్స్ లభిస్తోంది. అందులో విశాఖ రూరల్ జిల్లా కోటాలో సన్యాసిపాత్రుడికి ఒకటి ఇస్తారు అంటున్నారు. పాత్రుడికి ఇవ్వడం ద్వారా అయ్యన్నపాత్రుడు పక్క ఉన్న మిగిలిన నాయకులను కూడా వైసీపీలోకి లాగేసి ఆయన్ని ఏకాకికి చేసే అజెండా ఉందిట. అలాగే నమ్మి వచ్చిన వారికి అన్యాయం చేయమనే సందేశం పంపడం కూడా ఉందని చెబుతున్నారు. మరో వైపు చూస్తే సన్యాసిపాత్రుడిని ఎమ్మెల్సీ చేస్తే కనుక నర్శీపట్నం రాజకీయ కధ వేరుగా సాగుతుంది అంటున్నారు. అన్నాదమ్ముల పోరులో సరికొత్త అంకం కూడా మొదలుకాబోతుంది అని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే స్థానిక ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ కి సన్యాసిపాత్రుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఇష్టం లేదుట. అయితే విజయసాయిరెడ్డి, జగన్ లదే ఫైనల్ డెసిషన్ కాబట్టి తమ్ముడికి పదవి ఖాయమని అంటున్నారు.