అయ్యన్న… రెడీ అంటున్నారట
విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయ విరామం అన్నది వాయిదా పడిందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నాయి. [more]
విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయ విరామం అన్నది వాయిదా పడిందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నాయి. [more]
విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయ విరామం అన్నది వాయిదా పడిందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నాయి. అయ్యన్నపాత్రుడు వయసు ఏడు పదులకు చేరువలో ఉంది. 2019 ఎన్నికల్లోనే తాను పోటీ చేయను అని అయ్యన్న అధినేత చంద్రబాబుకు చెప్పారని టాక్. బాబు మాత్రం ససేమిరా అంటూ అయ్యన్నపాత్రుడు చేత పోటీ చేయించారు. ఇక 2024 ఎన్నికల్లో ఆయన కుమారుడు విజయ్ పాత్రుడు పోటీకి దిగుతారు అని అంతా అనుకుంటున్న సంగతి విదితమే. చిత్రంగా అయ్యన్న పాత్రుడు మరోసారి రేసులోకి దూసుకువస్తున్నారు. అంటే పదవసారి అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్నమాటేగా.
మరింత జోష్ తో …
తాజాగా అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు వేడుకలు జిల్లాలో జరిగాయి. టీడీపీలో ఈ మధ్య కాలంలో ఏ నేతకు జరగనంత ఘనంగా అయ్యన్నపాత్రుడు పుట్టిన రోజు వేడుకలను అభిమానులు నిర్వహించారు. ఈ సందర్బంగా అయ్యన్న మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని వారు కోరుకున్నారు. అయ్యన్నపాత్రుడు నాయకత్వంలో జిల్లాలో టీడీపీ బంపర్ విక్టరీ కొడుతుందని కూడా వారు జోస్యం చెప్పేసారు. అయ్యన్న కూడా చిరునవ్వులు చిందిస్తూ అభిమానుల కోరికలను విన్నారు. అయ్యన్నపాత్రుడు ఎన్నికల రాజకీయాల్లో ఉండాల్సిందే అని టీడీపీ నాయకులు కూడా గట్టిగా కోరుకుంటున్నారు. అయ్యన్న పోకడలు చూసినా ఇంకా ఇప్పుడే రిటైర్ కావాలని లేదు అన్నట్లుగానే ఉంది మరి.
గట్టి పోటీతోనే….
నర్సీపట్నం అసెంబ్లీ సీటులో పాతుకుపోవాలని వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ చూస్తున్నారు. ఆయన పాతిక వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన పార్టీని పటిష్టం చేస్తున్నారు కూడా. ఆయనకే మరోసారి టికెట్ జగన్ ఇస్తారు. మరి ఆయన మీద విజయ్ పాత్రుడిని పెడితే గెలుపు అనుమానమే అని అంటున్నారు. దాంతో మళ్ళీ అయ్యన్నపాత్రుడు బరిలోకి దిగాల్సిందే అంటున్నారు. తొలిసారి పోటీ చేసి ఓడిపోతే విజయ్ పాత్రుడి కెరీర్ కూడా ఇబ్బందులలో పడుతుంది. ఇక టీడీపీకి చావో రేవో లాంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క సీటు అవసరమే. అందుకే అయ్యన్నపాత్రుడుకే టికెట్ అని బాబు అంటున్నారట. దానికి ఈయన ఓకే చెప్పేసారని టాక్.
ఉన్నత పదవి అంటే..?
సరే అయ్యన్నపాత్రుడు మరో ఎన్నికల్లోనూ పోటీ చేస్తారు. అవకాశం ఉంటే గెలుస్తారు. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే అయ్యన్నకు ఉన్నత పదవి అంటే ఏది ఇస్తారు అన్నదే చర్చ. ఆయన ఎన్నో కీలకమైన శాఖలు చేశారు. ఇక ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవే రావాలి. అది కూడా మరింత ప్రాధాన్యత కలిగిన శాఖ. అది కచ్చితంగా బాబు ఇస్తారని అంటున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాల వెలమ నాయకులలో అయ్యన్నపాత్రుడు సీనియర్. పైగా అచ్చెన్నాయుడు కి ఈ తడవ ప్రాధాన్యత తగ్గుతుంది అంటున్నారు దాంతో ఈ సమీకరణలు అన్నీ సరి చూసుకునే అయ్యన్న రాజకీయాల నుంచి నాటౌట్ అంటున్నారట. మరి చూడాలి అయ్యన్నపాత్రుడు దశ ఎలా మారుతుందో