అయ్యన్న దూకుడుకు బ్రేకులేస్తున్న శిష్యుడు ?
విశాఖ జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సీనియర్ మోస్ట్ నేత. పెళ్ళి కాకుండానే మంత్రి అయిన రికార్డు ఆయన సొంతం. తెలుగుదేశం పార్టీలో పాతికేళ్ల [more]
విశాఖ జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సీనియర్ మోస్ట్ నేత. పెళ్ళి కాకుండానే మంత్రి అయిన రికార్డు ఆయన సొంతం. తెలుగుదేశం పార్టీలో పాతికేళ్ల [more]
విశాఖ జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సీనియర్ మోస్ట్ నేత. పెళ్ళి కాకుండానే మంత్రి అయిన రికార్డు ఆయన సొంతం. తెలుగుదేశం పార్టీలో పాతికేళ్ల వయసులోనే చేరి అన్న ఎన్టీఆర్ ఆశీస్సులతో డైరెక్ట్ గా ఎమ్మెల్యేగా చట్ట సభలో ప్రవేశించిన చరిత్ర అయ్యన్నపాత్రుడిది. నిజానికి ఆయనది నాలుగు పదుల రాజకీయ జీవితం. చంద్రబాబు కంటే తానే టీడీపీలో సీనియర్ ని అని గర్జించే అయ్యన్న ఇప్పటికి ముచ్చటగా మూడు సార్లు నర్శీపట్నంలో ఓటమి పాలు అయ్యారు.
వాటి కంటే దారుణం…..
అయ్యన్నపాత్రుడు హవాకు తొలిసారి బ్రేకులు పడింది 1989 ఎన్నికల్లో. ఆ ఎన్నికల్లో మొదటిసారిగా టీడీపీకి నర్శీపట్నం చేజారింది. ఆ తరువాత మళ్ళీ చూస్తే 2009 ఎన్నికల్లో ఓటమి ఆయనను పలుకరించింది. అయితే ఈ రెండు ఓటముల కంటే దారుణమైనది 2019 ఎన్నికల్లో ఓటమి. ఏకంగా పాతిక వేల పై చిలుకు ఓట్ల తేడాతో అయ్యన్నపాత్రుడు మాజీ ఎమ్మెల్యే అయిపోయారు. మొదటి రెండు సార్లు రెండు మూడు వేల ఓట్ల తేడా వస్తే ఈసారి మాత్రం ఫలితం గట్టిగా దెబ్బకొట్టింది. పైగా పాతవారు ఇద్దరూ వేవ్ లో గెలిచిన నేతలు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ కి జగన్ వేవ్ తో పాటు పదునైన వ్యూహాలు కూడా ఉన్నాయి. పైగా ఆయన అయ్యన్నపాత్రుడుకు ఒకప్పటి శిష్యుడు కూడా.
పట్లూ గుట్లూ తెలుసు…..
అయ్యన్నపాత్రుడు రాజకీయాన్ని సాంతం చదివేసిన ఘనుడు తాజా ఎమ్మెల్యే ఉమా శంకర్. ఇక అయ్యన్నపాత్రుడు వృద్దాప్యంలో ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల నాటికి డెబ్బైకి చేరువ అవుతారు. ఇక ఆయన కుమారుడు విజయ్ పాత్రుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు. అయ్యన్నతో ఉన్న వారంతా ఇపుడు విజయ్ ని చూసి పక్కకు తప్పుకునే సీన్ ఉంది. అయ్యన్న పాలిటిక్స్ వేరు, కొడుకు తీరు వేరు అన్నదే వారి భావన. ఇలాంటి వారిని పసిగట్టి టీడీపీ పని పట్టేస్తున్నారు ఎమ్మెల్యే ఉమాశంకర్. ఇక ఆయనకు అయ్యన్నే ధీటుగా నిలవలేకపోయారు అన్నది 2019 ఎన్నిక నిరూపించింది. ఇపుడు కొడుకు పోటీ చేస్తే తట్టుకోవడం కష్టమేనని అంటున్నారు.
బిగించేస్తున్నారా…?
ఇక ఉమాశంకర్ తాను సుదీర్ఘకాలం రాజకీయం చేయడానికి కావాల్సిన ఆయుధాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. 2019 లా 2024 ఉండదు అని ఆయనకూ తెలుసు. అందుకే టీడీపీని వీక్ చేసే పనిలో పడ్డారు. ఇక ఎప్పటికపుడు అయ్యన్నపాత్రుడుకు కౌంటర్లు వేయడమే కాదు, టీడీపీని నైతికంగా దెబ్బతీస్తూ దూకుడు రాజకీయమే చేస్తున్నారు. ఒకనాడు అయ్యన్నపాత్రుడు చేసిన పాలిటిక్స్ నే ఇపుడు శిష్యుడు కూడా అమలు చేస్తూండడంతో పూర్తిగా వెనకాడిపోవడం అయ్యన్న వంతు అవుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయ్ పాత్రుడు ఓడిపోతే మాత్రం రాజకీయంగా అయ్యన్నపాత్రుడు ఫ్యామిలీ కధ ముగిసినట్లేనని అంటున్నారు.