బాలినేనిని తప్పించక తప్పదా?
జగన్ త్వరలో తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. దాదాపు 90 శాతం మంది మంత్రులను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రి వర్గం [more]
జగన్ త్వరలో తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. దాదాపు 90 శాతం మంది మంత్రులను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రి వర్గం [more]
జగన్ త్వరలో తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. దాదాపు 90 శాతం మంది మంత్రులను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రి వర్గం నుంచి తప్పిస్తారా? లేదా? అన్న చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డిని జగన్ ఖచ్చితంగా తప్పిస్తారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పుడు జగన్ చేపట్టబోయేది ఎన్నికల కేబినెట్ కావడంతో తన సామాజికవర్గంతో పాటు బంధువులను కూడా జగన్ దూరం పెడతారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
సీనియర్ నేతగా….
బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో సీనియర్ నేత. జగన్ కు దగ్గరి బంధువు కూడా. గత ఎన్నికల ప్రచారంలోనే జగన్ బాలినేని శ్రీనివాసరెడ్డికి హామీ ఇచ్చారు. తన కేబినెట్ లో ఖచ్చితంగా బాలినేని ఉంటారని ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పారు. దీంతో తొలి కేబినెట్ లోనే బాలినేని శ్రీనివాసరెడ్డికి చోటు దక్కింది. కీలకమైన విద్యుత్తు శాఖను జగన్ అప్పగించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి 1999 నుంచి 2009 వరకూ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలను సాధించారు.
అంతా తానే అయి…..
2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తిరిగి 2019 ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి విజయం సాధించి మంత్రి అయ్యారు. జగన్ కు దగ్గర బంధువు కావడం, పార్టీలో సీనియర్ కావడంతో జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పిందే వేదం. ఆయన చెప్పిన వారికే పదవులు దక్కాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కూడా బాలినేని బేఖాతరు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు సయితం బాలినేని ఇంటి వద్ద పడిగాపులు కాయాల్సిందే. కరణం బలరాం, శిద్ధారాఘవరావు వంటి నేతలు పార్టీలో చేరడానికి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కారణమని చెప్పకతప్పదు.
ఎన్నికల కేబినెట్ కావడంతో?
అయితే ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీకి ఊహించిన రీతిలో విజయం దక్కలేదు. ఈ జిల్లాలో నాలుగు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. దీంతో త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ జిల్లా నుంచి ఇతర సామాజిక వర్గాలను జగన్ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. బంధువులను, సామాజికవర్గాన్ని దూరం పెట్టడంలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి రెన్యువల్ కాదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.