వైసీపీ ఎంపీని అనధికారికంగా బహిష్కరించారా?
వైసీపీ ఎంపీని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అనధికారికంగా బహిష్కరించినట్లు కనపడుతుంది. ఆయనకు పార్టీ కార్యక్రమాలకు గాని, అధికారిక కార్యక్రమాలకు గాని ఎటువంటి ఆహ్వానాలు అందడం లేదు. ఆయనను [more]
వైసీపీ ఎంపీని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అనధికారికంగా బహిష్కరించినట్లు కనపడుతుంది. ఆయనకు పార్టీ కార్యక్రమాలకు గాని, అధికారిక కార్యక్రమాలకు గాని ఎటువంటి ఆహ్వానాలు అందడం లేదు. ఆయనను [more]
వైసీపీ ఎంపీని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అనధికారికంగా బహిష్కరించినట్లు కనపడుతుంది. ఆయనకు పార్టీ కార్యక్రమాలకు గాని, అధికారిక కార్యక్రమాలకు గాని ఎటువంటి ఆహ్వానాలు అందడం లేదు. ఆయనను దూరం పెట్టే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ ఎంపీ సమయమొచ్చినప్పుడల్లా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయనే తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ ను వైసీీపీ నేతలే పట్టించుకోవడం లేదు.
కనీసం తిరుపతిలో…..
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో మూడు చిత్తూరు జిల్లాలోనూ, నాలుగు నెల్లూరు జిల్లాలోనూ ఉన్నాయి. బల్లి దుర్గా ప్రసాద్ గతంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటికీ ఆయన గూడూరులోనే నివాసం ఉంటున్నారు. తిరుపతి ఎంపీగా అక్కడ కనీసం క్యాంప్ ఆఫీస్ ను కూడా ఏర్పాటు చేసుకోలేదు. అప్పుడప్పడు చుట్టపు చూపుగా వచ్చి పోవడం తప్ప మరేమీ లేదు.
వైసీపీ నేతలతో సంబంధాలు….
అసలు చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్ కు అసలు ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఒకరున్నారని కూడా తెలియదు. భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డితో ఆయనకు అంతగా సంబంధాలు లేవు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా పరిచయం లేదు. దీంతో తనకు పరిచయం ఉన్న నెల్లూరు జిల్లాలోనే ఎక్కువగా ఆయన సమయం వెచ్చిస్తున్నారు. దీంతో తిరుపతిలో ఆయనకు పట్టు చిక్కడం లేదు.
వీలయినప్పుడల్లా అసహనాన్ని…..
అధికారిక కార్యక్రమాలకు కూడా ఆహ్వానాలు అందకపోతుండటంతో ఆయన అధికారులపై విరుచుకుపడుతున్నారు. ఎంపీని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎంపీ గెలిచి ఏడాది గడుస్తున్నా సమీక్షల్లో తప్పించి ఎమ్మెల్యేలు తనను కలుసుకోవడం లేదు. నియోజకవర్గ అభివృద్ధి నిధులపై చర్చించడం లేదు. దీంతో తనకు అనధికారికంగా వైైసీపీ నేతలు బహిష్కరించారని బల్లి దుర్గా ప్రసాద్ ఫీల్ అవుతున్నారు. ఆయన ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో మౌనంగానే అవమానాలను భరిస్తున్నారు. అయితే బల్లి దుర్గాప్రసాద్ అందరినీ కలుపుకుని పోయే వ్యక్తి కాదంటున్నారు వైసీపీ నేతలు.