బండారు రాజకీయం ఇక క్లోజ్… ?
విశాఖ జిల్లాలో సీనియర్ నేతగా మాజీ మంత్రిగా బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. ఆయన పరవాడలో బలమైన నేత. 1989లో తొలిసారి గెలిచిన ఆయన ఆ తరువాత వరసబెట్టి [more]
విశాఖ జిల్లాలో సీనియర్ నేతగా మాజీ మంత్రిగా బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. ఆయన పరవాడలో బలమైన నేత. 1989లో తొలిసారి గెలిచిన ఆయన ఆ తరువాత వరసబెట్టి [more]
విశాఖ జిల్లాలో సీనియర్ నేతగా మాజీ మంత్రిగా బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. ఆయన పరవాడలో బలమైన నేత. 1989లో తొలిసారి గెలిచిన ఆయన ఆ తరువాత వరసబెట్టి మరో రెండు సార్లు గెలిచారు. ఇక 2004లో ఆయన ఓడిపోయారు. 2009 నాటికి పరవాడ పెందుర్తిలో కలిసింది. దాంతో అక్కడ పోటీ చేసిన బండారు సత్యనారాయణమూర్తి ఓటమి పాలు అయ్యారు. 2014లో అన్ని సమీకరణలు కలసిరావడంతో మరో మారు గెలిచారు. కానీ తిరిగి 2019 ఎన్నికల్లో మాత్రం బండారు భారీ ఓట్ల తేడాతో ఒక యువకుడి చేతిలో ఓడిపోయారు. మొత్తానికి చూస్తే మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో నాలుగు సార్లు బండారు సత్యనారాయణమూర్తి గెలిచారు. ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు.
యువకుడు ప్రత్యర్థిగా…?
ఇక 2019 ఎన్నికల్లో బండారు సత్యనారాయణమూర్తి మీద పోటీ చేసిన అన్నపురెడ్డి అదీప్ రాజ్ యువకుడు, గట్టిగా మూడు పదుల వయసు కూడా లేని ఈ యువ నేత ఆరు పదుల వయసులో ఉన్న బండారుని ఓడించి షాక్ తినిపించారు. ఇక బండారు రాజకీయంగా కూడా సుదీర్ఘమైన ప్రయాణమే చేశారు. ఆయన 2014 టైమ్ లో మంత్రి పదవిని ఆశించారు కానీ చంద్రబాబు నగరానికి చెందిన గంటా శ్రీనివాసరావుకు కట్టబెట్టారు. దాంతో బాబు మీద అలిగిన బండారు సత్యనారాయణమూర్తి కొన్నాళ్ళు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కదు అని ప్రచారం కూడా జరిగింది. కానీ ఏదో విధంగా సంపాదించుకున్నారు.
కొడుకు కారణంగానే….
అటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు స్వయానా మామ కావడం… ఇటు అచ్చెన్నకు వియ్యంకుడు కావడంతో బండారు సత్యనారాయణమూర్తికి ఏదోలా టిక్కెట్ దక్కింది. చివరికి అధినేత బాబు అంచనాలే నిజమై ఆయన ఓడారు. కొడుకు బండారు అప్పలనాయుడు కారణంగానే బండారు సత్యనారాయణమూర్తి ఓడారు అన్న మాట ఉంది. దానికి తోడు బండారు నోటి దురుసుతనం కూడా ఆయన్ని ఈ స్థాయికి చేర్చిందని అంటారు. పరవాడ ఎమ్మెల్యేగా ఉన్నపుడు పట్టున్న ప్రాంతాలు ఆ తరువాత బైఫరికేషన్ లో పోయాయి. పెందుర్తిలో బండారు ఇప్పటికి రెండు సార్లు ఓటమి పాలు కావడానికి అది కూడా ఒక కారణం అంటున్నారు.
కుటుంబంలో ఎవరికీ…?
మరో వైపు వయోభారం కూడా బండారు సత్యనారాయణమూర్తిని యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంచుతోంది. కొడుకు కోసమే ఆయన ఇపుడు టీడీపీని ఆశ్రయించి ఉన్నారని అంటున్నారు. అయితే బండారు అప్పలనాయుడుకు కూడా టికెట్ దక్కడం కష్టమే అంటున్నారు. ఇక్కడ టీడీపీలో మరో బలమైన నేత, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఉన్నారు. ఆయనకే ఈసారి టికెట్ ఖాయమని వినిపిస్తోంది. అదే జరిగితే బండారు సత్యనారాయణమూర్తి రాజకీయం క్లోజ్ అన్న మాట ఉంది మరి