ఈయనను ఏరిపారేస్తారా? అది సాధ్యమేనా?
యడ్యూరప్ప కసిగా ఉన్నారు. తనపైన, కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేస్తున్న పార్టీ నేతలను వదలిపెట్ట కూడదని యడ్యూరప్ప భావిస్తున్నారు. గత కొంతకాలంగా యడ్యూరప్పకు వ్యతిరేకంగా బీజేపీలో అసమ్మతి [more]
యడ్యూరప్ప కసిగా ఉన్నారు. తనపైన, కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేస్తున్న పార్టీ నేతలను వదలిపెట్ట కూడదని యడ్యూరప్ప భావిస్తున్నారు. గత కొంతకాలంగా యడ్యూరప్పకు వ్యతిరేకంగా బీజేపీలో అసమ్మతి [more]
యడ్యూరప్ప కసిగా ఉన్నారు. తనపైన, కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేస్తున్న పార్టీ నేతలను వదలిపెట్ట కూడదని యడ్యూరప్ప భావిస్తున్నారు. గత కొంతకాలంగా యడ్యూరప్పకు వ్యతిరేకంగా బీజేపీలో అసమ్మతి తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఈ అసమ్మతి నేతల వెనక కేంద్రం పెద్దల హస్తం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ యత్నాళ్ పదే పదే యడ్యూరప్ప పై విమర్శలుచేస్తున్నారు. యడ్యూరప్పకు ఆయన కొరకరాని కొయ్యగా మారారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి….
నిజానికి యడ్యూరప్ప అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అసమ్మతి బయలుదేరింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసి వచ్చిన ఎమ్మెల్యేలకు తిరిగి ఉప ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించడంతోనే రగడ మొదలయింది. ఇక మూడుసార్లు జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ అసలైన బీజేపీనేతలకు అన్యాయం జరిగిందని, ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు యడ్యూరప్ప పెద్ద పీట వేస్తున్నారన్న విమర్శలు పార్టీ నుంచే విన్పించాయి.
అప్పటి నుంచే అసమ్మతి….
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళినీకుమార్ కటీల్ సయితం యడ్యూరప్ప తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటి నుంచే అసమ్మతి నేతలు జట్టు కట్టి యడ్యూరప్పకు వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఇక బసవగౌడ పాటిల్ యత్నాల్ అయితే యడ్యూరప్ప కుటుంబంపైనే ధ్వజమెత్తుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ నిలదీస్తున్నారు. యడ్యూరప్ప కుమారుడు రాజ్యాంగేతర శక్తిగా మారారని ఆయన చేసిన విమర్శలు యడ్యూరప్పును ఇబ్బందిలో పడేశాయి.
చర్యలు తీసుకోవాలని…..
ఈ నేపథ్యంలోనే యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రకు అసెంబ్లీ టిక్కెట్ దక్కలేదంటున్నారు. దీంతో యడ్యూరప్ప ఇటీవల బసవగౌ పాటిల్ యత్నాల్ పై చర్యలు తీసుకోవాల్సిందేనని అధినాయకత్వం వద్ద పట్బుబడుతూ వస్తున్నారు. కానీ అక్కడి నుంచి కూడా ఎటువంటి స్పందన లేకపోవడం బసవగౌడ పాటిల్ యత్నాల్ ఏమాత్రం తగ్గకపోవడంతో తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో ఫిర్యాదు చేయించారు. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు బసవగౌడ పాటిల్ యత్నాల్ పై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. లేకుంటే పార్టీకి రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మొత్తం మీద తన వ్యతిరేక శక్తులను కట్టడి చేయాలని యడ్యూరప్ప స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కానీ బసవగౌడ పాటిల్ యత్నాల్ పై అధినాయకత్వం చర్యలు తీసుకోవడం కష్టమేనంటున్నారు.