టీడీపీలో వాళ్లందరికీ వీళ్లే శత్రువులట
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతోంది. గత ఎన్నికల్లో బలమైన ఓటు బ్యాంకు దూరమయింది. బీసీలు గత ఎన్నికల్లో జగన్ వైపు చూశారు. అయితే [more]
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతోంది. గత ఎన్నికల్లో బలమైన ఓటు బ్యాంకు దూరమయింది. బీసీలు గత ఎన్నికల్లో జగన్ వైపు చూశారు. అయితే [more]
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతోంది. గత ఎన్నికల్లో బలమైన ఓటు బ్యాంకు దూరమయింది. బీసీలు గత ఎన్నికల్లో జగన్ వైపు చూశారు. అయితే ఈసారి తిరిగి బీసీలను తనవైపునకు తిప్పుకునేందుకు చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒకటి పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను బీసీ వర్గాలకు చెందిన వారినే ఎక్కువగా నియమించారు.
బీసీలకు పెద్దపీట….
బీసీ లకు పెద్దపీట వేశామని చెప్పుకోవడానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చంద్రబాబు అచ్చెన్నాయుడిని నియమించారు. పార్లమెంటరీ ఇన్ ఛార్జులకు కూడా ఆ సామాజికవర్గాలకే ఎక్కువగా అవకాశమిచ్చారు. దీనివల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని చంద్రబాబు ఆశించారు. అయితే పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ ఛార్జులను నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. లైట్ తీసుకుంటున్నారు. బీసీలు ఉన్న చోట వారు నిర్వహించే సమావేశాలకు కూడా పార్టీ నేతలు హాజరు కావడం లేదు.
రాజీనామాకు….
దీంతో పార్లమెంటరీ ఇన్ ఛార్జులలో నిరాశ మొదలయింది. వారిలో కొందరు రాజీనామా చేేసేందుకు కూడా సిద్దమవుతున్నారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో రెండు పార్లమెంటు నియోజక వర్గాలు న్నాయి. ఇందులో బాపట్లకు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును నియమించారు. ఇక్కడ నేతలు ఆయనకు బాగానే సహకరిస్తున్నారు. అదే సమయంలో ఒంగోలు పార్లమెంటుకు బీసీ సామాజికవర్గానికి చెందిన నూకసాని బాలాజీని నియమించారు.
సహకరించకపోగా…
కానీ నూకసాని బాలాజీకి టీడీపీ నేతలు సహకరించడం లేదు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒంగోలు, కొండెపి, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలున్నాయి. ఇందులో కొండపి నియోజవర్గంలోనే టీడీపీ ఎమ్మెల్యేలున్నారు. మిగిలిన చోట్ల ఇన్ ఛార్జులున్నారు. వీరెవ్వరూ నూకసాని బాలాజీ ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరుకావడం లేదు. దీనిపై అధినాయకత్వానికి కూడా ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విశాఖలో పల్లా శ్రీనివాసరావుకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. బీసీ కార్డు ఉపయోగించుకుందామంటే చంద్రబాబుకు సొంత పార్టీ నేతలే దెబ్బకొడుతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.