చివరకు జరిగేది అదే
మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి ఇప్పట్లో తొలిగేలా లేదు. భారతీయ జనతా పార్టీ, శివసేనలు దాదాపు విడిపోవడానికే నిర్ణయించుకున్నాయి. ఎవరి వ్యూహంలో వారున్నారు. శివసేన డిమాండ్లకు తలొగ్గకూడదని బీజేపీ, [more]
మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి ఇప్పట్లో తొలిగేలా లేదు. భారతీయ జనతా పార్టీ, శివసేనలు దాదాపు విడిపోవడానికే నిర్ణయించుకున్నాయి. ఎవరి వ్యూహంలో వారున్నారు. శివసేన డిమాండ్లకు తలొగ్గకూడదని బీజేపీ, [more]
మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి ఇప్పట్లో తొలిగేలా లేదు. భారతీయ జనతా పార్టీ, శివసేనలు దాదాపు విడిపోవడానికే నిర్ణయించుకున్నాయి. ఎవరి వ్యూహంలో వారున్నారు. శివసేన డిమాండ్లకు తలొగ్గకూడదని బీజేపీ, కమలాన్ని అధికారంలోకి రానివ్వకూడదని శివసేన గట్టిగా పట్టుపట్టి కూర్చున్నాయి. నిన్న మొన్నటి వరకూ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదురుతుందని భావించిన వారు సయితం ఇప్పుుడు పెదవి విరవడం విశేషం.
శివసేన డిమాండ్లకు….
. మంత్రి వర్గంలోనూ యాభై శాతం ఇవ్వాలంటోంది. కానీ బీజేపీ ఇందుకు సుముఖంగా లేదు. డిప్యూటీ సీఎం పదవితో పాటు పదమూడు మంత్రి పదవులే ఇస్తామని నిక్కచ్చిగా తేల్చి చెప్పింది. ఇష్టముంటే రావచ్చని లేకుంటే పోవచ్చని కూడా పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. శివసేన ఎమ్మెల్యేలు 45 మంది తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది.
ముఖ్యమంత్రిగా ప్రమాణానికి…..
ఇక బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన దేవేంద్ర ఫడ్నవిస్ ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అవసరమైతే శాసనసభలో బలం నిరూపించుకోవచ్చన్నది బీజేపీ ఆలోచన. ఆ వ్యూహంతోనే తమతో శివసేన ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెబుతోంది. ఇప్పటికే గత ఎన్నికల్లో సీట్లు లభించక రెబెల్ గా పోటీ చేసిన పదిహేను మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలిపారంటున్నారు.
రెండు మద్దతిస్తేనే…..
శివసేన విషయానికొస్తే కేవలం ఎన్సీపీ మద్దతిచ్చినంత మాత్రాన అధికారంలోకి రాలేదు. మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేదు. కాంగ్రెస్, ఎన్సీపీ కలసి శివసేనకు మద్దతిస్తేనే అధికారం సాధ్యమవుతుంది. అయితే ఎన్సీపీ కొంత సానుకూలంగానే కన్పిస్తుంది. బీజేపీని దెబ్బ కొ్టేందుకు కాంగ్రెస్ బయట నుంచి మద్దతిచ్చే అవకాశముందంటున్నారు. మొత్తం మీద శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీలు రెండూ మద్దతిస్తేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. మొత్తం మీద మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ హీటెక్కుతున్నాయి.