తేడా పార్టీ తో టచ్ మీ నాట్ ?
1996లో వాజ్ పేయ్ కేవలం 13 రోజులు మాత్రమే దేశానికి ప్రధానిగా ఉన్నారు. ఆయనకు మద్దతు ఇచ్చేందుకు ఏ ఒక్క పార్టీ ముందుకు రాలేదు. ఆనాడు వాజ్ [more]
1996లో వాజ్ పేయ్ కేవలం 13 రోజులు మాత్రమే దేశానికి ప్రధానిగా ఉన్నారు. ఆయనకు మద్దతు ఇచ్చేందుకు ఏ ఒక్క పార్టీ ముందుకు రాలేదు. ఆనాడు వాజ్ [more]
1996లో వాజ్ పేయ్ కేవలం 13 రోజులు మాత్రమే దేశానికి ప్రధానిగా ఉన్నారు. ఆయనకు మద్దతు ఇచ్చేందుకు ఏ ఒక్క పార్టీ ముందుకు రాలేదు. ఆనాడు వాజ్ పేయ్ ఆవేదనతో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అంటరాని తనం ఉండరాదు అని రెండున్నర దశాబ్దాల క్రితం నాటి బీజేపీ వరిష్ట నేత అటల్ బిహారీ వాజ్ పేయ్ పిలుపు ఇచ్చారు. వాజ్ పేయ్ వంటి నేత నోట అలాంటి పిలుపు రావడంతో ఆ తరువాత భారత దేశాన సమీకరణలు మారిపోయి బీజేపీతో పొత్తులకు చాలా పార్టీలు ముందుకు వచ్చాయి. దానికి వాజ్ పేయ్ రాజకీయ వ్యక్తిత్వం, నిజాయతీ, విలువలకు కట్టుబడే మనస్తత్వం ప్రధాన కారణం. అది ఫ్లాష్ బ్యాక్ అయితే ఇపుడు నరేంద్ర మోడీ, అమిత్ షాల సారధ్యంలోని బీజేపీ అచ్చమైన తేడా గల పార్టీగానే చెప్పాలి.
మోజు వీడి…?
బీజేపీ మీద క్రమంగా జనాలకు మోజు వీడుతోంది. తాజాగా జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఒక పెద్ద ఉదాహరణ. ఇక సౌత్ లో బీజేపీ సమీప భవిష్యత్తులో ప్రవేశించలేదు అన్నది కూడా పూర్తిగా రూఢీ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి మళ్ళీ పాతికేళ్ల క్రితం నాటి చేదు అనుభవాలు ఎదురవుతాయా అన్నదే చర్చగా ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టడానికి తెలుగు రాష్ట్రాలో బహుశా ఏ పార్టీ కూడా ముందుకు రాదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎవరూ నోరు విప్పి ఆ మాట బయటకు చెప్పకపోయినా 2024 ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రం బీజేపీ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడేందుకు ఏపీ రాజకీయం సిధ్ధంగా ఉంది అన్న వార్తలు అయితే వస్తున్నాయి.
వైసీపీ రాం రాం…
ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల తరువాత వైసీపీ పెద్దల మైండ్ సెట్ కూడా మారిపోయింది. బీజేపీ నేతలు ఆ ఎన్నికల ప్రచారం వేళ అన్న మాటలు, నేరుగా జగన్ ని టార్గెట్ చేసుకుని వ్యక్తిగత నిందారోపణలు చేయడం వంటివి చూసిన వైసీపీ పెద్దలు బీజేపీ తో రాం రాం అనేస్తారు అంటున్నారు. ఇప్పటికైతే బాహాటంగా ఎలాంటి స్నేహం లేకపోయినా లోపాయికారిగా మద్దతు ఉంది. ఇక మమత, స్టాలిన్ ఆయా రాష్ట్రాల్లో గెలవడంతో కొత్త ధైర్యం కూడా వైసీపీకి వచ్చింది అంటున్నారు. బీజేపీ ని నెత్తిన పెట్టుకుని మోయడం వల్ల జనాల్లో చులకన కావడం తప్ప ఒరిగేది ఏదీ లేదని కూడా ఫ్యాన్ పార్టీ నేతలకు పూర్తిగా అర్ధమైంది అంటున్నారు.
ఒంటరిని చేస్తారా….?
ఇదే నిర్ణయంతో టీడీపీ జనసేన కూడా ఉన్నాయని టాక్. జనసేనకు అయితే బీజేపీ మీద పీకల దాకా కోపం ఉంది. తెలుగు రాష్ట్రాలలో తమ పొత్తుని చులకన చేశారని, అతికి పోయి తమను పలుచన చేసి బీజేపీ కూడా ఏపీలో చతికిలపడిందని అంటున్నారు. ఇక మీదట బీజేపీతో కలసి వెళ్ళడం కష్టమే అని ఆ పార్టీలో వినిపిస్తున్న మాట. అలాగే చంద్రబాబు కూడా తిరుపతి లో బీజేపీ పెర్ఫార్మెన్స్ చూశారు, అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత మోడీ ఇమేజ్ డ్యామేజ్ కావడమూ చూశారు. దాంతో ఆయన బీజేపీని పక్కన పెట్టి ముందుకు పోవాలనుకుంటున్నారు. అయితే ఒంటరిగా కాదు, ఏపీలో జనసేన, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగలన్నది బాబు ఆలోచనట. వీలైతే కాంగ్రెస్ ని కూడా కలుపులు మహా కూటమిని తయారు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉందిట. కాంగ్రెస్ కూడితే మళ్ళీ ప్రత్యేక హోదా వంటి వాటి మీద ఏపీ జనాలకు హామీ ఇచ్చి తమ వైపు తిప్పుకోవచ్చు అన్నదే బాబు మాస్టర్ ప్లాన్. మొత్తానికి చూస్తే ఏపీ రాజకీయాల వరకూ బీజేపీ అంటరాని పార్టీగా ఉందనే అంటున్నారు.