అలా కట్టడి చేశారా?
భారతీయ జనతా పార్టీలో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో నేర్పరులున్నారు. ముఖ్యంగా మోడీ, అమిత్ షా జోడీ తర్వాత బీజేపీ ప్రత్యర్థులను మాత్రమే కాదు మిత్రులను కూడా తమ [more]
భారతీయ జనతా పార్టీలో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో నేర్పరులున్నారు. ముఖ్యంగా మోడీ, అమిత్ షా జోడీ తర్వాత బీజేపీ ప్రత్యర్థులను మాత్రమే కాదు మిత్రులను కూడా తమ [more]
భారతీయ జనతా పార్టీలో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో నేర్పరులున్నారు. ముఖ్యంగా మోడీ, అమిత్ షా జోడీ తర్వాత బీజేపీ ప్రత్యర్థులను మాత్రమే కాదు మిత్రులను కూడా తమ పరిధిలో ఉంచేందుకే ఎక్కువ ఇష్టపడుతుంది. మహారాష్ట్రలోనూ ఇదే జరుగుతుంది. బీజేపీ తాను చెప్పదలచుకుంది చెప్పేసింది. ఇప్పుడు బంతి శివసేన కోర్టులో ఉంది. తామిచ్చినవి తీసుకుని తమతో కలసి వస్తారా? లేక విడిపోయి అధికారానికి దూరమవుతారా? అన్నది శివసేనకే వదిలిపెట్టడం విశేషం.
నమ్మకమైన మిత్రపక్షమేమీ…..
నిజానికి భారతీయ జనతా పార్టీకి శివసేన నమ్మకమైన మిత్రపక్షమేమీ కాదు. 2014 నుంచి ఇటు కేంద్రంలోనూ, అటు రాష్ట్రంలోనూ సంకీర్ణ ప్రభుతాల్లో భాగస్వాములుగా ఉన్నప్పటికీ శివసేన ఎప్పుడూ బీజేపీకి పక్కలో బల్లెమే. ఆ సంగతి బీజేపీ నేతలకు తెలియంది కాదు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటిపై శివసేన తప్పుపట్టింది. తన అధికారిక సామ్నా పత్రికలో మోడీకి వ్యతిరేకంగా వ్యాసాలు రాసింది. దీంతో పాటు ఎప్పటికప్పుడు మోడీని టార్గెట్ చేయడం అలవాటుగా మారింది.
రాహుల్ పై ప్రశంసలు….
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వేగం మరింత పెంచింది. రాహుల్ గట్టిగా పోరాడారని ప్రశంసించింది. రాహుల్ లో నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయని, ఖచ్చితంగా ఎదిగే నాయకుడని వ్యాఖ్యానాలు చేసింది. అయితే పార్లమెంటు ఎన్నికల సమయానికి మళ్లీ బీజేపీతో జట్టుకట్టింది. నిలకడలేని శివసేనతో నిత్యం కలహాల కాపురమేనని బీజేపీ భావించింది. అందుకే తాము ఇస్తాం మీరు తీసుకోమని షరతు పెట్టింది.
సేనకు తప్పేట్లు లేదు….
శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పదమూడు మంత్రి పదవులు ఇస్తామని కుండబద్దలు కొట్టేసింది. ఇందుకు శివసేన అంగీకరించని పరిస్థితిని కల్పించింది. ఇటు కాంగ్రెస్ తో గాని, అటు ఎన్సీపీతో గాని చేతులు కలిపితే మరాఠాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి వస్తుందన్నది శివసేనకు తెలియంది కాదు. అందుకోెసమే బీజేపీ సానుకూలంగానే చెబుతూ కట్టడి చేసిందన్నది వాస్తవం. ఇప్పుడు శివసేన సంకీర్ణ సర్కార్ లో భాగస్వామి కావడానికి ఒప్పుకోవాల్సిన పరిస్థిితి ఏర్పడింది.