నూకలు చెల్లిపోయాయి.. కోలుకోవడం కష్టమే
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఇక భవిష్యత్ లో ఆ పార్టీవైపు ఎవరూ చూసే అవకాశాలు కూడా కన్పించడం లేదు. మొన్నటి [more]
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఇక భవిష్యత్ లో ఆ పార్టీవైపు ఎవరూ చూసే అవకాశాలు కూడా కన్పించడం లేదు. మొన్నటి [more]
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఇక భవిష్యత్ లో ఆ పార్టీవైపు ఎవరూ చూసే అవకాశాలు కూడా కన్పించడం లేదు. మొన్నటి వరకూ చేరికలు ఉంటాయని బీరాలు పలికిన బీజేపీ నేతలు ఇప్పుడు ఆ విషయంలో మౌనంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల వరకూ బీజేపీ లో ఎవరూ చేరే అవకాశాలు లేవని, వీలయితే జనసేనలో చేరికలు ఉండే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అసలే అంతంత మాత్రం….
బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలు అంతంత మాత్రమే. టీడీపీతో పొత్తు పెట్టుకుని కొన్ని చోట్ల గెలిచిన సందర్భాలు ఉన్నాయి. గత ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ బీజేపీలో కొంత ఊపు కన్పించింది. వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. కేంద్రంలో అధికారంలోకి రావడంతోనే బీజేపీలో అప్పట్లో చేరికలు జరిగాయి.
వరస ఓటములతో…..
అయితే ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర ప్రభుత్వంపై కూడా అసంతృప్తి పెరిగింది. మోదీ ఇమేజ్ కూడా తగ్గింది. ఈ పరిస్థితుల్లో కమలం పార్టీలో చేరడం కట్టే రాజకీయ సన్యాసం స్వీకరించడమే బెటర్ అన్న అభిప్రాయం ఉంది. జనసేనతో జట్టుకట్టినా పెద్దగా ఫలితాలు సాధించలేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో పాటు తిరుపతి ఉప ఎన్నికల్లోనూ దారుణ ఓటమి చవి చూడటంతో ఆ పార్టీకి ఓటు బ్యాంకు లేదన్న విషయం స్పష్టమయింది.
జనసేనలో చేరేందుకు…?
ఇక సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత చేరికలు పూర్తిగా నిలిచిపోయాయి. సోము వీర్రాజు వైఖరే ఇందుకు కారణమన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. అయితే మొన్నటి వరకూ బీజేపీ వైపు చూసిన నేతలు ఇప్పుడు జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోని కొందరు టీడీపీ నేతలు జనసేనలో కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. దీన్నిబట్టి బీజేపీకి ఇక ఏపీలో నూకలు చెల్లినట్లే అని చెప్పుకోవాలి.