ఎదిగే అవకాశాలు కూడా లేవట
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో గతంలో ఉన్న జోష్ లేదు. రెండు గ్రూపులుగా ఉన్న పార్టీలో అందరూ సైలెంట్ అయిపోయారు. సోము వీర్రాజు అనుకూల, వ్యతిరేక వర్గాలు [more]
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో గతంలో ఉన్న జోష్ లేదు. రెండు గ్రూపులుగా ఉన్న పార్టీలో అందరూ సైలెంట్ అయిపోయారు. సోము వీర్రాజు అనుకూల, వ్యతిరేక వర్గాలు [more]
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో గతంలో ఉన్న జోష్ లేదు. రెండు గ్రూపులుగా ఉన్న పార్టీలో అందరూ సైలెంట్ అయిపోయారు. సోము వీర్రాజు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఏపీ బీజేపీని మరింత బలహీనం చేస్తున్నాయని చెప్పకతప్పదు. వరసగా అన్ని ఎన్నికల్లో దారుణ ఓటమితో పాటు వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ పరిస్థితి మెరుగుపడదన్న భావనతో బీజేపీ వైపు చూసే వారు కరువయ్యారు. తెలంగాణలో బీజేపీ దూసుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎదగలేక అవస్థలు పడుతుంది.
బేస్ లేకపోయినా?
భారతీయ జనతా పార్టీకి ఏపీలో తొలి నుంచి బేస్ లేదు. ఎప్పుడైనా టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పడు మాత్రమే నాలుగు సీట్లలో విజయం దక్కేది. ఒంటరిగా పోటీ చేస్తే నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయని మొన్నటి ఎన్నికలలో అర్థమయింది. స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికలో కూడా బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో నేతలతో పాటు కిందిస్థాయి క్యాడర్ లోనూ నైరాశ్యం అలుముకుంది.
జనసేనతో పొత్తు ఉన్నా?
జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే కొంత సానుకూలత వస్తుందని బీజేపీ నేతలు భావించారు. కానీ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న ప్పటికీ రెండు పార్టీల నేతలు, క్యాడర్ మధ్య సమన్వయం లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఇది స్పష్టంగా కన్పించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా బీజేపీ తరుపున ప్రచారం చేసినా జనసేన ఓటు బ్యాంకు బీజేపీ అభ్యర్థికి పడలేదు. ఇక రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయి.
రెండు వర్గాలుగా….?
ఒక వర్గం సోము వీర్రాజును వ్యతిరేకిస్తుంది. వారంతా కొందరు టీడీపీ నుంచి వచ్చి చేరిన వారు కాగా, మరికొందరు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కావడం విశేషం. అందుకే సోము వీర్రాజు తన టీమ్ తో ఏదో కార్యక్రమాలను మమ అనిపించేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని కొందరుపెదవి విరుస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఒక వర్గం అభిప్రాయపడుతుండగా, ససేమిరా అని మరో వర్గం చెబుతోంది. దీంతో ఏపీ బీజేపీలో రాను రాను నేతల మధ్య అంతర్గత యుద్ధం మరింత ముదురుతుంది. ఇది పార్టీని మరింత బలపరుస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.