Bjp : ఆ నెపం ఇక బాబుపై నెట్టలేరేమో?
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఒక స్ట్రాటజీ లేదు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించకుండా సమస్యలపై పరిష్కారం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు చేయడం మంచి వ్యూహం కాదు. ఇప్పుడు [more]
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఒక స్ట్రాటజీ లేదు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించకుండా సమస్యలపై పరిష్కారం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు చేయడం మంచి వ్యూహం కాదు. ఇప్పుడు [more]
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఒక స్ట్రాటజీ లేదు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించకుండా సమస్యలపై పరిష్కారం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు చేయడం మంచి వ్యూహం కాదు. ఇప్పుడు బీజేపీలో అదే జరుగుతుంది. ఏ సమస్యను నెత్తికెత్తికోవాలో? దేనిని పక్కన పెట్టాలో తెలియని పరిస్థితిలో బీజేపీ ఉంది. అందుకే ఇక బీజేపీ ఏపీలో ఎదుగుతుంది అని చెప్పేందుకు అవకాశాలే కన్పించడం లేదు.
నాయకత్వ లేమి…
రాష్ట్ర విభజన తర్వాత మోదీ హవాతో టీడీపీతో పొత్తుతో శాసనసభలో అడుగు పెట్టింది. అయితే గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు సాధించుకుని శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా చేసుకుంది. నియోజకవర్గాలలో సరైన నాయకత్వం లేకపోవడం, బీజేపీ పాలన పట్ల అసంతృప్తి పెరిగిపోవడంతో దాని ఊసే ఏపీలో కన్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సయితం రాష్ట్ర బీజేపీని ఇరకాటంలో పెడుతున్నాయి.
వేళ్ల మీద లెక్క పెట్టగలిగే…
బీజేపీకి వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన నియోజకవర్గాల్లోనే కొంత క్యాడర్ ఉంది. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్ని, తిరుపతి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో మాత్రమే దానికి నాయకత్వం, క్యాడర్ ఉంది. గత ఎన్నికల ఫలితాలను బట్టి చూసినా నాలుగైదు నియోజకవర్గాలలో మాత్రమే దాని ప్రభావం ఉంది. గడచిన ఏడేళ్లలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలం పెంచుకోలేకపోయింది. కనీస స్థాయిలో ప్రభావం చూపే స్థితికి చేరుకోలేకపోయింది.
టీడీపీతో పొత్తుతో….
ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీ పొత్తు కారణంగానే రాష్ట్రంలో బీజేపీ ఎదగలేకపోయిందని సోము వీర్రాజు వంటి నేతలు నిన్న మొన్నటి వరకూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ అది గతం. గత రెండేళ్లలో బీజేపీ ఏపీలో పార్టీ పరంగా సాధించింది ఏమిటి అంటే? ప్రశ్నలే మిగులుతాయి. ఇక టీడీపీపై నెపం పెట్టే ఛాన్స్ బీజేపీ నేతలు కోల్పోయారు. ఇప్పుడు జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ పార్టీ ఎదగలేకపోవడానికి కారణాలపై పార్టీ నేతలు అంతర్మధనం చేసుకోవాల్సి ఉంది.