Bjp : ఒక్క సీటు కూడా రాదని డిసైడ్ అయ్యారా?
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇక ఎదగలేదన్న విషయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం కూడా గుర్తించినట్లుంది. అందుకే పెద్దగా పట్టించుకోవడం లేదు. తిరుపతి ఉప ఎన్నిక [more]
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇక ఎదగలేదన్న విషయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం కూడా గుర్తించినట్లుంది. అందుకే పెద్దగా పట్టించుకోవడం లేదు. తిరుపతి ఉప ఎన్నిక [more]
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇక ఎదగలేదన్న విషయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం కూడా గుర్తించినట్లుంది. అందుకే పెద్దగా పట్టించుకోవడం లేదు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంాగా వచ్చిన నడ్డా ఇక్కడి నాయకత్వం, సమన్వయ లేమిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండు ప్రాంతీయ పార్టీల మధ్య తాము ఎదగలేమని కేంద్ర నాయకత్వం కూడా నిర్ధారణకు వచ్చినట్లుంది. అందుకే ఏపీ నేతలకు ప్రయారిటీ లేదు.
రెండోసారి అధికారంలోకి…
భారతీయ జనతా పార్టీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ నుంచి అసలు ప్రాతినిధ్యమే లేదు. ఒక్కరికి కూడా మంత్రి పదవులు ఇవ్వలేదు. ఇక్కడ నోటా కంటే తక్కువ ఓట్లు రావడం ఒక కారణం కాగా, ఎవరూ గెలవకపోవడం కూడా మరో కారణమని నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. కానీ కేంద్ర నాయకత్వం ఇవ్వదలచుకుంటే రాజ్యసభ సభ్యులుగా ఉన్న జీవీఎల్ నరసింహారావుకు ఇవ్వొచ్చు. అదే సమయంలో రాజ్యసభ పదవిని ఇచ్చి పురంద్రీశ్వరి లాంటి వారికి మంత్రి పదవి ఇవ్వొచ్చు.
పొరుగు రాష్ట్రంలో…
కానీ రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా తెలంగాణకు కీలక మంత్రి పదవి కట్టబెట్టిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీపై చిన్న చూపు చూస్తుంది. ఒక్క కంభంపాటి హరిబాబును గవర్నర్ పదవికి ఎంపిక చేయడం మినహా ఏపీ బీజేపీ నేతలకు పదవి దక్కింది ఏదీ లేదు. ఇది పార్టీలో చర్చనీయాంశమైంది. చరిష్మా నేతలకు ఏపీలో కొదవలేదు. అనేక మంది నేతలున్నా వారిని పక్కన పెట్టింది. జాతీయ కార్యవర్గంలోనూ తెలంగాణ నేతలను ఎక్కువ సంఖ్యలో తీసుకుంది.
జాతీయ కార్యవర్గంలోనూ….
బీజేపీ ఇటీవల ప్రకటించిన జాతీయ కార్యవర్గంలోనూ ఏపీీకి ఒక్క పదవి దక్కింది. మాజీ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను మాత్రమే జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. జీవీఎల్ నరిసింహారావును జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించారు. భవిష్యత్ లోనూ ఏపీ బీజేపీ నేతలకు పదవులు దక్కడం కష్టమే. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ ఏపీ నుంచి సీట్లు వస్తాయన్న నమ్మకం లేకపోవడం వల్లనే కేంద్ర నాయకత్వం ఏపీ బీజేపీ నేతలను పూర్తిగా పక్కన పెట్టేసిందంటున్నారు.