Bjp : బాబుతో కలిసే ఛాన్సే లేదట
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఒక స్పష్టతతో ఉంది. ఏపీలో అధికారం ఇప్పటికిప్పుడు రాకపోయినా పెద్దగా ఆ పార్టీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఆ [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఒక స్పష్టతతో ఉంది. ఏపీలో అధికారం ఇప్పటికిప్పుడు రాకపోయినా పెద్దగా ఆ పార్టీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఆ [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఒక స్పష్టతతో ఉంది. ఏపీలో అధికారం ఇప్పటికిప్పుడు రాకపోయినా పెద్దగా ఆ పార్టీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఆ ఆశ కూడా లేదనుకోండి. కేంద్రంలో అధికారంలోకి రావడమే దాని లక్ష్యం. ఏపీలో మాత్రం నిదానంగా విస్తరించాలన్న గోల్ తో ఉంది. ఇందుకు రాష్ట్ర నేతలకు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపింది. ఏపీలో పెద్దగా ఖర్చు చేయవద్దని, ఎక్కువ హంగామా కూడా చేయవద్దని కూడా పేర్కొనడం విశేషం.
జనసేనతోనే….
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను సునిశితంగా గమనిస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వం వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేనతో మాత్రమే కలసి వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చింది. తెలుగుదేశం పార్టీని తమ దరిదాపుల్లోకి రానివ్వ కూడదని కూడా భావిస్తుంది. తమతో కలసి చంద్రబాబు లబ్ది పొందడం మినహా పార్టీకి ప్రత్యేకంగా ఒనగూరే లాభం లేదన్న అంచనాకు వచ్చింది. పార్టీ బాధ్యుడు సునీల్ దేవధర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి.
సునీల్ వ్యాఖ్యలతో…
టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన ముగ్గురు నేతలు బీజేపీని పార్కింగ్ ప్లేస్ గా భావిస్తున్నారని సునీల్ దేవధర్ వ్యాఖ్యానించారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వారు టీడీపీిని దగ్గర చేయాలని చేస్తున్న ప్రయత్నాలు సునీల్ దేవధర్ తో తిప్పికొట్టారన్నది అర్థమవుతుంది. సునీల్ దేవధర్ పార్టీలో కీలక నేత. జాతీయ నాయకత్వం చెప్పినట్లుగానే ఆయన నడుచుకుంటారు.
ఆందోళనలో బాబు…
చంద్రబాబు మొన్నటి వరకూ బీజేపీ తనతో కలసి వస్తుందని భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే రాష్ట్ర నేతలతో పాటు కేంద్ర నాయకత్వం కూడా చంద్రబాబుతో పొత్తుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. పవన్ కల్యాణ్ కూడా బీజేపీని అంత సులువుగా వదిలిపెట్టి రాలేని పరిస్థిితి. దీంతో చంద్రబాబు కొంత ఆందోళనలోనే ఉన్నారు మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ఏపీలో టీడీపీతో జట్టుకట్టేందుకు సిద్ధంగా లేదన్నదది స్పష్టంగా తెలుస్తోంది.