Bjp : తిరగబడుతున్నారా?
భారతీయ జనతా పార్టీలో పొత్తుల వ్యవహారం ముదిరిపాకాన పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న దానిపై ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. బీజేపీలో [more]
భారతీయ జనతా పార్టీలో పొత్తుల వ్యవహారం ముదిరిపాకాన పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న దానిపై ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. బీజేపీలో [more]
భారతీయ జనతా పార్టీలో పొత్తుల వ్యవహారం ముదిరిపాకాన పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న దానిపై ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. బీజేపీలో టీడీపీ అనుకూల, వ్యతిరేక వర్గాలు పొత్తుల విషయంలో పోరుకు సిద్ధమవుతున్నట్లు కన్పిస్తుంది. తాజాగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దంపడుతున్నాయి. టీడీపీతో పొత్తుకు ఒకవర్గం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అనుకూల, వ్యతిరేక….
బీజేపీలో కొన్ని దశాబ్దాల నుంచి చంద్రబాబు అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయి. కంభంపాటి హరిబాబు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నాటి నుంచి చంద్రబాబుకు అనుకూలంగా ఆ పార్టీ వ్యవహరిస్తుంది. అయితే ఆర్ఎస్ఎస్ భావాలున్న పార్టీ నేతలు కొందరు చంద్రబాబుతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు కారణంగానే పార్టీ ఏపీలో బలోపేతం కాలేదని వారు వాదిస్తున్నారు. తమతో పొత్తు ఉంటేనే చంద్రబాబుకు అధికారం సిద్ధిస్తుందని కూడా వారు లెక్కలతో వివరిస్తున్నారు.
సీఎం రమేష్ కామెంట్స్ తో…
అయితే తాజాగా సీఎం రమేష్ పార్టీ ఇన్ ఛార్జిపైనే వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. పార్టీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావులు పొత్తులను నిర్ణయించలేరని, పార్టీ జాతీయ అధ్యక్షుడు నిర్ణయించాల్సి ఉంటుందని ఆయన చేసిన కామెంట్స్ బీజేపీలో పొత్తుల పోరును సూచిస్తున్నాయి. మరోవైపు సునీల్ దేవధర్ కూడా ఘాటుగానే వ్యాఖ్యానించారు. టీడీపీతో పొత్తు ఉండే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు.
బయటకు వెళ్లేందుకు…
టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లు పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు. పొత్తు ఉంటేనే బీజేపీకి కొన్ని సీట్లు వస్తాయని, లేకుంటే 2019 ఎన్నికల ఫలితలు పునరావృతమవుతాయని చెబుతున్నారు. ఈ మేరకు వారు వత్తిడి తెచ్చేందుకే సిద్ధమవుతున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు కూడా వారు సిద్ధమవుతున్నట్లే కన్పిస్తుంది. మొత్తం మీద ఏపీ బీజేపీలో పొత్తుల పోరు ఎన్నికలకు మూడేళ్ల ముందే ప్రారంభమయింది.