Tdp : జట్టు కట్టలేమా? అది అసాధ్యమా?
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమయింది. ఎలాగైనా బీజేపీతో జట్టుకట్టి వచ్చే ఎన్నికలకు వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన. కానీ అది సాధ్యమయ్యేలా కన్పించడం [more]
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమయింది. ఎలాగైనా బీజేపీతో జట్టుకట్టి వచ్చే ఎన్నికలకు వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన. కానీ అది సాధ్యమయ్యేలా కన్పించడం [more]
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమయింది. ఎలాగైనా బీజేపీతో జట్టుకట్టి వచ్చే ఎన్నికలకు వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన. కానీ అది సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. బీజేపీీలో ఒకవర్గం తీవ్రంగా టీడీపీతో పొత్తుకు వ్యతిరేకిస్తుండటం ఇబ్బందిగా మారింది. తాజాగా ఢిల్లీలో సునీల్ దేవధర్ మీడియా సమావేశం పెట్టి మరీ టీడీపీతో పొత్తు ఉండదని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది.
ఎన్నికలు లేకపోయినా…?
నిజానికి ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు లేవు. పొత్తులపై ఇప్పుటికిప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఇప్పుడే ఆయన అత్యవసరంగా ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. సునీల్ దేవధర్ ఆషామాషీ నేత కాదు. మోదీ, అమిత్ షా కోటరీ లో ఆయన ముఖ్యుడు. అనేక రాష్ట్రాల్లో ఆయన బాధ్యుడిగా వ్యవహరించి బీజేపీని విజయం వైపు పయనించేలా చేశారు. మంచి వ్యూహకర్తగా పేరుంది.
హైకమాండ్ మాటేనా?
ఆయన ఒక మాట మాట్లాడితే అది హైకమాండ్ మనసులో నుంచి వచ్చిందేనన్న అభిప్రాయం చాలా మంది బీజేపీ నేతల్లో ఉంది. అలాంటి సునీల్ దేవధర్ పదే పదే టీడీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేయడం వెనక ఉద్దేశ్యం ఏమై ఉంటుందన్న దానిపై టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అమిత్ షా, మోదీలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారా? లేక ఇది సునీల్ దేవధర్ వ్యక్తిగత అభిప్రాయం అన్న దానిపై కూడా టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు.
చివరి నిమిషం వరకూ….
బీజేపీ, జనసేన కలసి పోటీ చేసి, తాము ఇతర పార్టీలతో కలసి పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో ఫలితం ఉండదు. అందుకోసం బీజేపీతో పొత్తుకోసం చివరి వరకూ టీడీపీ ప్రయత్నిస్తుంది. అయితే ఇదే సమయంలో కేంద్ర నాయకత్వాన్ని ఎలా ఒప్పించాలన్న దానిపై అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వని రోజు నుంచి చంద్రబాబు కసరత్తులు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఏపీ రాజకీయల్లో చర్చనీయాంశమైంది.