Badvel : బద్వేలు బలి తీసుకుంటుందా… ఏంది?
బద్వేలులో బీజేపీకి ఇప్పుడు ఆ భయం పట్టుకుంది. పరువు పోకుండా కాపాడుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. కనీసం డిపాజిట్లు దక్కక పోతే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి మరింత ఇబ్బందులు [more]
బద్వేలులో బీజేపీకి ఇప్పుడు ఆ భయం పట్టుకుంది. పరువు పోకుండా కాపాడుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. కనీసం డిపాజిట్లు దక్కక పోతే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి మరింత ఇబ్బందులు [more]
బద్వేలులో బీజేపీకి ఇప్పుడు ఆ భయం పట్టుకుంది. పరువు పోకుండా కాపాడుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. కనీసం డిపాజిట్లు దక్కక పోతే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి మరింత ఇబ్బందులు తప్పవు. ఏపీలో బీజేపీకి రోజులు బాగా లేవు. జనసేనను తమ మిత్రపక్షంగా తెచ్చుకున్నా పెద్దగా ఉపయోగం లేదు. రెండు పార్టీలు కలసి పనిచేసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన ఫలితాలు రాలేదు. ఇప్పటికే ఏపీలో బీజేపీ బలహీనంగా ఉందనుకుందనుకుంటున్న తరుణంలో బద్వేలు ఉప ఎన్నిక మరింత దెబ్బతీస్తుందంటున్నారు.
చేరికలే లేక….
2019 ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో అధికారంలోకి రావడంతో తొలిరోజుల్లో కొందరు బీజేపీ వైపు చూశారు. కానీ గత ఏడాది కాలంగా బీజేపీ లో చేరికలు లేవు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తర్వాత బీజేపీ పని పూర్తిగా అయిపోయింది. జనసేన మద్దతు ఉన్నా లాభం లేదనుకుని ఆ పార్టీ వైపు ఎవరూ చూడటం లేదు. ఇక ఇటీవల కాలంలో జనసేన బీజేపీ మిత్రపక్షంగా తప్పు కుంటుం దన్న ప్రచారం కూడా ఆ పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారింది.
జనసేనను కాదని….
తాజాగా జనసేనను కాదని బద్వేలు ఉప ఎన్నికల బరిలోకి బీజేపీ దిగింది. ఇక్కడ పెద్దగా బలం లేకపోయినా కేంద్ర నాయకత్వం నిర్ణయం మేరకు పోటీలో దిగామని చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు ఎవరూ వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. కొద్దో గొప్పో గెలిచే అవకాశమన్న హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలోనే వారు పాల్గొంటారని తెలిసింది. బద్వేలు ఉప ఎన్నికను రాష్ట్ర నాయకత్వానికే వదిలేశారు.
వచ్చే అవకాశమే లేదు….
ఇక తమ మిత్రుడైన పవన్ కల్యాణ్ కూడా ప్రచారానికి వస్తారన్న నమ్మకం లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లోనే ఒకసారి వచ్చి వెళ్లారు. అలాంటిది బద్వేలు ఉప ఎన్నిక బరినుంచి తప్పు కున్న ఆయన వచ్చి ఓటర్లను ఏం అడుగుతారన్న ప్రశ్న తలెత్తుతోంది. దీంతో బద్వేలు ఉప ఎన్నికలలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావడం కష్టమేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పడు రాష్ట్ర బీజేపీ నాయకత్వం కనీస ఓట్లు సాధించేందుకు శ్రమిస్తున్నారు. బద్వేలు ఎన్నిక పార్టీని మరింత బలహీనపర్చే అవకాశముంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.