ఎంత గింజుకున్నా కష్టమే.. జనం తడాఖా చూపుతారట
మోదీ, అమిత్ షాలకు జరగబోతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు సవాల్ అనే చెప్పాలి. వారు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు ప్రజామోదం ఉంటుందా? లేదా? అన్నది ఈ ఎన్నికలతో [more]
మోదీ, అమిత్ షాలకు జరగబోతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు సవాల్ అనే చెప్పాలి. వారు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు ప్రజామోదం ఉంటుందా? లేదా? అన్నది ఈ ఎన్నికలతో [more]
మోదీ, అమిత్ షాలకు జరగబోతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు సవాల్ అనే చెప్పాలి. వారు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు ప్రజామోదం ఉంటుందా? లేదా? అన్నది ఈ ఎన్నికలతో తేలిపోనుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. దీంతో ఎన్నికల ప్రచారం కూడా వేడెక్కింది. మోదీ, అమిత్ షాలు అన్ని రాష్ట్రాలు తిరుగతూ బీజేపీని గెలిపించాలని కోరుతున్నారు. బడ్జెట్ లో ఈ ఐదు రాష్ట్రాలకు కొంత పెద్దపీట వేయడంతో వాతావరణం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను పరిశీలిస్తే….?
పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ విశ్వప్రయత్నం చేస్తుంది. మమత బెనర్జీని గద్దె దించాలని అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంది. టీఎంసీ నుంచి అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలను తన వైపునకు తిప్పుకుంది. ఇంత చేసినా ఒపీనియన్ పోల్స్ లో మాత్రం మోదీ, షాలకు ఎదురుదెబ్బే తగిలింది. మరోసారి మమత బెనర్జీకి పట్టం కట్టాలన్న యోచనలో బెంగాలీలు ఉన్నారని ముందస్తు సర్వేలో వెల్లడయింది. ఇక్కడ గెలుపు బీజేపీకి అంత సులువు కాదు.
అసోం : అసోంలో బీజేపీ అధికారంలో ఉంది. ఐదేళ్ల పాటు పాలనలో అసోంలో బీజేపీ పట్ల ప్రజలు పెద్దగా సంతృప్తిగా లేరు. పౌరసత్వ చట్టం కూడా ఇక్కడ బీజేపీకి ఇబ్బందికరంగా మారే అవకాశముంది. దీంతో పాటు కరోనా సమయంలో సరైన చర్యలు తీసుకోకపోవడం, నిత్యవసరాల ధరలు నింగినంటడం కూడా ఇక్కడ అధికార బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. కాంగ్రెస్ కొంచెం కష్టపడితే ఇక్కడ విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.
కేరళ : ఇక్కడ బీజేపీకి ఎటువంటి అవకాశమూ లేదు. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లు బలంగా ఉన్నాయి. దఫాల వారీగా ఆ రెండు పార్టీలే అధికారాన్ని చేజిక్కిచుకుంటున్నాయి. ఇక్కడ మెట్రో మ్యాన్ శ్రీధర్ వంటి వారిని తీసుకుని ప్రజలకు చేరువవ్వాలని చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించవని అంటున్నారు. కేరళలో అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా బీజేపీకి శ్రమ తప్ప ఫలితం రాదన్నది వాస్తవం. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లు మాత్రమే అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది.
తమిళనాడు : తమిళనాడులోనూ బీజేపీ కూటమికి అవకాశాలు ఎంతమాత్రం లేవు. ఇక్కడ కాంగ్రెస్ తో ఉన్న డీఎంకే కూటమి విజయం సాధిస్తుందన్నది వాస్తవం. సర్వేలు అన్నీ దాదాపు అదే స్పష్టం చేస్తున్నాయి. అన్నాడీఎంకేలో నాయకత్వం లేకపోవడం, బీజేపీకి అక్కడ పట్టు లేకపోవడంతోనే గెలుపు అవకాశాలు దాదాపుగా లేనట్లే. ఒక్క పుదుచ్చేరిలోనే బీజేపీ గెలిచే ఛాన్స్ ఉందంటున్నారు. అది కూడా నారాయణస్వామి మీద సానుభూతి వచ్చిందంటే ఈ చిన్న రాష్ట్రం కూడా మోదీ, షాలకు ఝలక్ ఇస్తుంది. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు, రైతు చట్టాలు, అన్ని వర్గాల ప్రజల అసంతృప్తి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రభావం చూపక తప్పదు.