ఎటూ తేల్చుకోలేకపోతున్నారు
మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టేందుకు మీనమేషాలు లెక్కిస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు రోజులైనా ఇప్పటికీ మహారాష్ట్ర పై బీజేపీలో [more]
మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టేందుకు మీనమేషాలు లెక్కిస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు రోజులైనా ఇప్పటికీ మహారాష్ట్ర పై బీజేపీలో [more]
మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టేందుకు మీనమేషాలు లెక్కిస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు రోజులైనా ఇప్పటికీ మహారాష్ట్ర పై బీజేపీలో ఒక స్పష్టత రాలేదు. అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీలు సయితం దీనిని ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. హర్యానా అంశం ముగిసిన తర్వాతనే మహారాష్ట్రపై దృష్టి పెట్టనున్నారు. మహారాష్ట్రలో తమ లెక్కలు తప్పాయని అమిత్ షా భావిస్తున్నారట.
అంగీకరించినా…..
గత లోక్ సభ ఎన్నికల సమయంలో పొత్తుల చర్చల్లో చెరిసగం అనే అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమయిన విషయాన్ని బీజేపీ నేతలూ అంగీకరిస్తున్నారు. లోక్ సభలో గెలిచేందుకు శివసేన పొత్తును బీజేపీ అప్పట్లో ఉపయోగించుకుని సక్సెస్ అయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు ఇంత సంఖ్య వస్తుందని, తమకు స్థానాలు తగ్గుతాయని అమిత్ షా అంచనా వేయలేకపోయారని బీజేపీ నేతలు సయితం అంగీకరిస్తున్నారు.
ఇన్ని సీట్లు వస్తాయని….
నిజానికి లోక్ సభ ఎన్నికల తర్వాత ఫడ్నవిస్ తో అమిత్ షా నిత్యం టచ్ లోనే ఉన్నారట. ఎట్టిపరిస్థితుల్లో 120కి పైగా స్థానాలు సాధించాలన్న టార్గెట్ ను అమిత్ షా ఫడ్నవిస్ ముందు ఉంచారు. ఇందుకోసమే ఫడ్నవిస్ కు సర్వాధికారాలు అప్పగించారు. అభ్యర్థుల ఎంపికలో సయితం ఫడ్నవిస్ నిర్ణయాలకే ప్రాధాన్యత ఇచ్చారు అమిత్ షా. అయితే ఫలితాలను చూస్తే 105 స్థానాలను మించలేదు. స్వతంత్ర అభ్యర్థులు 15 మంది టచ్ లో ఉన్నప్పటికీ మరో 40 మంది సభ్యులు బీజేపీకి అవసరం అవుతారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఏం చేయాలన్నదీ….
మరోవైపు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే హుంకరిస్తూనే ఉన్నారు. సగం సగం ఫార్ములా అమలు చేయాల్సిందేనని వత్తిడి తెస్తున్నారు. తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను సీఎం కుర్చీలో చూడాలని ఆయన తహతహలాడుతున్నారు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే బీజేపీ మార్క్ పోతుందన్న భయం అమిత్ షాలో ఉంది. అందుకే ఆయన దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. శివసేనతో కలసి వెళ్లేది వాస్తవమే అయినా పంపకాల్లో అమిత్ షా క్లారిటీగా ఉన్నారంటున్నారు. మొత్తం మీద గెలిచామన్న ఆనందం లేకుండా అమిత్ షా మహారాష్ట్ర విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతున్నారు.