విడిపోతే కాని విలువ తెలియలేదా?
మహారాష్ట్రలో బీజేపీ ఒంటరిపోరు లాభించేట్లు లేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీ బలాన్ని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ శివసేనతో కలసి హిందుత్వ [more]
మహారాష్ట్రలో బీజేపీ ఒంటరిపోరు లాభించేట్లు లేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీ బలాన్ని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ శివసేనతో కలసి హిందుత్వ [more]
మహారాష్ట్రలో బీజేపీ ఒంటరిపోరు లాభించేట్లు లేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీ బలాన్ని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ శివసేనతో కలసి హిందుత్వ అజెండాతో ముందుకు వెళ్లిన బీజేపీ మహారాష్ట్రలో బలం పెంచుకున్నామనుకుంది. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని డొల్లతనం బయటపడిందంటున్నారు. శివసేనతో విభేదించి జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ కి ఓటములు తప్పలేదు. ఇది ఆ పార్టీ బలాన్ని తెలియజేస్తుందని శివసైనికులు సెటైర్లు వేస్తున్నారు.
పట్టున్న చోట్ల కూడా….
నాగ్పూర్, పుణే, ఔరంగాబాద్ వంటి చోట్ల బీజేపీకి మంచి పట్టుంది. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఇది బీజేపీ నేతలు కూడా ఊహించలేదు. దీంతో అధినాయకత్వం రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు తెలిసింది. ఓటమికి గల కారణాలను వెంటనే నివేదిక రూపంలో పంపాలని ఆదేశించింది. క్యాడర్ లో నేతలు ధైర్యం నింపలేకపోవడం వల్లనే బీజేపీ పట్టును కోల్పోవాల్సి వచ్చిందన్న అంచనా మాత్రం విన్పిస్తుంది.
ఇద్దరు కలిసి ఉన్నప్పుడు….
నిజానికి శివసేన, బీజేపీ కలిసినప్పుడు మహారాష్ట్రలో చెడుగుడు ఆడుకున్నారు. ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించారు. పార్లమెంటు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ మంచి విజయాలు నమోదు చేశాయి. అయితే సీఎం స్థానాన్ని శివసేనకు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో శివసేన విడిపోయింది. దీంతో బీజేపీ ఒంటరిపోరు చేయాల్సి వస్తోంది. హిందుత్వ అజెండాతో వెళ్లాలన్నా అవతలివైపు శివసేన ఉండటంతో అది వర్క్ అవుట్ కావడం లేదు.
ముంబయి ఎన్నికల్లోనూ…..
మరికొద్ది రోజుల్లో ముంబయి కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మిషన్ ముంబయ్ కార్యక్రమాన్ని బీజేపీ ప్రకటించింది. అయితే ముంబయి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలు కలసి పోటీ చేస్తుండటంతో విజయావకాశాలు బీజేపీకి కష్టమేనని చెప్పాలి. ముంబయి నగరం మీద శివసేనకు గట్టి పట్టుండమే ఇందుకు కారణం. మరి శివసేన విడిపోయిన తర్వాత కాని దాని విలువ ఏంటో బీజేపీకి తెలియడం లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.