Utttar pradesh : ఒవైసీ కాదట.. ప్రియాంక వల్లనే ఈసారి నష్టమట
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరుగుతున్నాయి. ఈ పోరు హోరా హోరీ సాగుతుంది. బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తుంది. అందుకు విపక్షాలు [more]
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరుగుతున్నాయి. ఈ పోరు హోరా హోరీ సాగుతుంది. బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తుంది. అందుకు విపక్షాలు [more]
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరుగుతున్నాయి. ఈ పోరు హోరా హోరీ సాగుతుంది. బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తుంది. అందుకు విపక్షాలు కూడా పరోక్షంగా సహకరించే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ బలపడితే అది బీజేపీకే లాభమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ ఎన్ని ఓట్లు చీలిస్తే అంత పోరులో ముందున్న సమాజ్ వాదీ పార్టీకే నష్టమని అంటున్నారు.
ఒవైసీ పార్టీతో…..
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ పోటీ చేసినా పెద్దగా ఇబ్బంది ఉండదు. యూపీలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఇప్పటి వరకూ సమాజ్ వాదీ పార్టీ వైపే ఉన్నారు. వారికి ఒవైసీ పార్టీ మీద పెద్దగా భ్రమల్లేవు. ఒకటి రెండు స్థానాల్లో తప్ప ఎంఐఎం రాష్ట్రమంతటా ఉన్న ముస్లిం ఓటర్లను ప్రభావం చేసే పరిస్థితి లేదు. హైదరాబాద్ పార్టీని యూపీ ముస్లిం సమాజం పెద్దగా సీరియస్ గా తీసుకోదు. ఒవైసీ సభల్లో చప్పట్ల వరకే పరిమితమవుతాయి.
ప్రియాంక ఉత్సాహంగా….
కానీ ప్రియాంక గాంధీ అలా కాదు. ఇటీవల ఆమె ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మిత్ర పక్షాలు ఏవీ తమను కలుపుకు వెళ్లమని చెప్పడంతో సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీకి పూర్వ వైభవం తేవాలనుకుంటున్నారు. అందుకే పూర్తిగా ఇన్ వాల్వ్ అవుతున్నారు. లఖింపూర్ వెళుతుండగా ప్రియాంక గాంధీ అరెస్ట్ తో కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజీ వచ్చిందంటున్నారు. నానమ్మ పోలికలు ఉండటం కూడా ఆమెను జనం వద్దకు సులువుగా చేరుస్తుంది.
కాంగ్రెస్ బలోపేతమయితే….
అయితే ప్రియాంక ఎంత పార్టీని బలోపేతం చేస్తే అంత సమాజ్ వాదీ పార్టీకి నష్టమన్న అభిప్రాయం ఎక్కువగా విన్పిస్తుంది. బీజేపీ కూడా అదే కోరుకుంటుంది. అందుకే అవసరం లేకపోయినా లఖింపూర్ ఘటనలో ప్రియాంక గాంధీని హౌస్ అరెస్ట్ చేసి సింపతీని పొందేలా ప్లాన్ చేసిందంటున్నారు. ముస్లింలు, దళిత ఓటర్లను ప్రియాంక గాంధీ ఆకట్టుకుంటే చాలు ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ విజయం సాధించినట్లే. మరి రానున్న రోజుల్లో రాజకీయాలు ఎలా మారతాయో చూడాలి.