మోదీ మీద ఆధారపడితే ఇక అంతే?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పాయనే అనుకోవాలి. ఇంతవరకూ మోదీ ఇమేజ్ మీదనే ఆధారపడి బీజేపీ గెలుస్తూ వస్తుంది. పార్టీ నాయకత్వం [more]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పాయనే అనుకోవాలి. ఇంతవరకూ మోదీ ఇమేజ్ మీదనే ఆధారపడి బీజేపీ గెలుస్తూ వస్తుంది. పార్టీ నాయకత్వం [more]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పాయనే అనుకోవాలి. ఇంతవరకూ మోదీ ఇమేజ్ మీదనే ఆధారపడి బీజేపీ గెలుస్తూ వస్తుంది. పార్టీ నాయకత్వం లేకుండా కేవలం మోదీతోనే అనేక రాష్ట్రాల్లో పార్టీ విజయం సాధించింది. అయితే క్రమేణా బీజేపీ పట్టు కోల్పోతుంది. అనేక రాష్ట్రాల్లో గతంలో కంటే భిన్నంగా బీజేపీ పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం రాష్ట్రాల్లో నాయకత్వం లేకపోవడమే.
మోదీ కారణంగానే?
2014 ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్ బలంగా ఉండేది. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి మోదీ జాతీయ రాజకీయాల్లోకి రావడం, ఆయన దేశాన్ని సత్వరం అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో దేశ వ్యాప్తంగా ప్రజలు మోదీకి జైకొట్టారు. బీజేపీకి అనూహ్యమైన విజయం లభించింది. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు మద్దతు పలికారు. నోట్ల రద్దు నుంచి లాక్ డౌన్ వరకూ ఆయన వెన్నంటే ఉన్నారు. కానీ మోదీ ఇమేజ్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
అనేక రాష్ట్రాల్లో….
ఆ కారణంగానే ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఇబ్బందుల్లో ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో బలంగా ఉందనుకుంటే అక్కడ బీజేపీకి పంచాయతీ ఎన్నికల్లో ఎదురుదెబ్బతగిలింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అసోం, పుదుచ్చేరి వంటి చిన్న రాష్ట్రాలనే చేజిక్కించుకుంది. అసోంలో హిమంత బిశ్వ శర్మ కారణంగానే బీజేపీ మరోసారి అధికారంలోకి రాగలిగింది. ఇక పశ్చిమ బెంగాల్ లోనూ బీజేపీ పరాజయానికి కారణం మోదీ అని చెప్పకతప్పదు.
నాయకత్వ లేమితో…?
పశ్చిమ బెంగాల్ లో సరైన నాయకత్వంలేదు. అలాగే కేరళలోనూ అంతే. మోదీ ఇమేజ్ తగ్గుతున్న కొద్దీ బీజేపీ అనేక రాష్ట్రాలను చేజార్చుకునే పరిస్థితికి వచ్చింది. దీనికి స్థానికంగా నాయకత్వం లేకపోవడమే. మోదీ, షాలు కూడా నాయకత్వాన్ని ఎదగనివ్వడం లేదన్న విమర్శలు పార్టీ నుంచి విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా బీజేపీ రాష్ట్రాల్లో సరైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోకుంటే ఇప్పుడు కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందన్నది విశ్లేషకుల అంచనా.