కన్ఫ్యూజన్ ఇక లేనట్లేనా?
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి, తెలుగుదేశం పార్టీలతో అనుసరించాలిసిన విధానానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంది కమలం పార్టీ. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలన్న గంపెడాశతో వున్న కమలానికి ఆరంభంలోనే [more]
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి, తెలుగుదేశం పార్టీలతో అనుసరించాలిసిన విధానానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంది కమలం పార్టీ. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలన్న గంపెడాశతో వున్న కమలానికి ఆరంభంలోనే [more]
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి, తెలుగుదేశం పార్టీలతో అనుసరించాలిసిన విధానానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంది కమలం పార్టీ. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలన్న గంపెడాశతో వున్న కమలానికి ఆరంభంలోనే సొంత పార్టీ నేతలనుంచే చిక్కులు ఎదురు అవుతూ వస్తున్నాయి. గత కొంతకాలంగా బిజెపి లో పాత కొత్త నేతల వ్యాఖ్యలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాజధాని, పోలవరం వంటి కీలక అంశాల్లో బిజెపి లోని నేతలు తలోమాట చెప్పడంతో కాషాయదళంలోనే కన్ఫ్యూజన్ మొదలైంది. దాంతో అధిష్టానం ఈ అంశంపై సీరియస్ గా దృష్టిపెట్టింది. పార్టీలోని సమన్వయ లోపాన్ని అధిగమించాలన్న సూచనలతో కీలక నాయకులతో సమీక్ష పెట్టుకుని ఒకేదారిలో ప్రయాణం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం విశేషం.
రెండు పార్టీలను తొక్కేయాలి …
ఏపీలో అధికారంలో వున్న వైసిపి విపక్షంలో వున్న టిడిపి లతో సమదూరం పాటించాలన్న ఏకాభిప్రాయానికి బిజెపి వచ్చేసింది. ఎవరిని ఉపేక్షించినా తరువాత పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతుందన్న ఆందోళన బిజెపి రహస్య సమీక్షలో వ్యక్తం చేయడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తరువాత ప్రజల్లో మార్పు బాగా వచ్చిందని సమీక్ష అభిప్రాయపడింది.
దగ్గరవ్వాలంటే…..
దీనిపై గట్టి ప్రచారంతో తెలుగు రాష్ట్రాల్లో అందరికి దగ్గర అవుతామని కనుక విస్తృతంగా ప్రచారం చేయాలన్న నిర్ణయం ఇందులో తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక రెండు పార్టీల సంగతి ఎలా వున్నా తమ పార్టీ అభివృద్ధి పనులతో పాటు ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే విధానం ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధం అయ్యింది బిజెపి. ఈ ఇన్ కెమెరా మీటింగ్ లో ఆర్ఎస్ఎస్ నేతలు కూడా కొందరు పాల్గొనడం మరింత ఆసక్తికరం అయ్యింది..