ఇంకా క్లారిటీ రాలేదా …?
పోలవరం ప్రోజెక్ట్ అంశంపై ఎపి బీజేపీకి ఇంకా క్లారిటీ కి రాలేదు. కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ అయినప్పటికీ దీనిపై బీజేపీకి ఏ మాత్రం క్రెడిట్ దక్కకుండా [more]
పోలవరం ప్రోజెక్ట్ అంశంపై ఎపి బీజేపీకి ఇంకా క్లారిటీ కి రాలేదు. కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ అయినప్పటికీ దీనిపై బీజేపీకి ఏ మాత్రం క్రెడిట్ దక్కకుండా [more]
పోలవరం ప్రోజెక్ట్ అంశంపై ఎపి బీజేపీకి ఇంకా క్లారిటీ కి రాలేదు. కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ అయినప్పటికీ దీనిపై బీజేపీకి ఏ మాత్రం క్రెడిట్ దక్కకుండా గతంలో టిడిపి సర్కార్ వ్యవహారం నడిపింది. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్ర పరిధిలోకి తెచ్చుకుని అంతా తామై వ్యవహరించింది. అలాగే ప్రాజెక్ట్ కి నిధులు సక్రమంగా విడుదల చేయడంలేదంటూ రాజకీయంగా కూడా ప్రయోజనం పొందే వ్యూహంతో టిడిపి నడుచుకుంది. ఎన్డీయే లో టిడిపి భాగస్వామిగా వున్నంతకాలం పెద్దగా పెదవి విప్పని కాషాయదళం చంద్రబాబు బయటకు రాగానే పోలవరం వ్యవహారాలపై దుమ్మెత్తిపోసింది. అది ఎంతలా అంటే ఎపి లోని ప్రధాన ప్రతిపక్షం వైసిపిని మించి ఒకదశలో బిజెపి ఆరోపణలు విమర్శలు సంధించింది నాటి తెలుగుదేశం ప్రభుత్వంపై. ప్రాజెక్ట్ కు అంకురార్పణ చేసింది వైఎస్ అంటూ కూడా పదేపదే బీజేపీ నాడు నొక్కిమరి చెప్పింది. ప్రధాని మోడీ సైతం పోలవరం ప్రాజెక్ట్ ను బాబు ఎటిఎం మాదిరి వాడేసుకుంటున్నారంటూ ఎన్నికల సభల్లో హోరెత్తించారు.
భిన్నవాదనలు …
ఎన్నికలు ముగిశాక బీజేపీ వ్యవరసరళి పూర్తిగా మారిపోయింది. కమలం లో చేరిన టిడిపి నేతలు జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ విధానాలను తప్పుపట్టారు. పాత నేతలు మాత్రం చంద్రబాబు అవినీతిని వైసిపి ఎందుకు తవ్వి తీయడం లేదంటూ దాడి మొదలు పెట్టారు. ప్రాజెక్ట్ నిర్మాణం తిరిగి కేంద్రానికి అప్పగించాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారు. కాషాయదళం నాయకులు భిన్నమైన వాదనలతో ఎపి బీజేపీ లో పోలవరం పై పార్టీ విధానం ఒకేరకంగా లేదని తేలిపోయింది. పార్టీలో గందరగోళానికి తెరదించేందుకు ఒకదశలో అధిష్టానం సైతం జ్యోక్యం చేసుకోవాలిసి వచ్చింది. చివరికి నేతలంతా పోలవరం బాట పట్టి వాస్తవ పరిస్థితులను ఎపి పార్టీ అభ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సారధ్యంలో అంచనా వేశారు. పనిలో పని గా వైసిపి పై ఘాటుగానే విమర్శలు గుప్పించారు. సాఫీగా పనులు సాగుతుంటే రివర్స్ టెండరింగ్ విధానం ఎందుకని ప్రశ్నించి పోలవరంపై కేంద్రం దృష్టి పెట్టాలని డిమాండ్ చేసి వచ్చేశారు.
వ్యూహం ఏమిటి …?
పోలవరం కేంద్రం నిధులతో నిర్మితం అవుతుంది. కనుక దీని క్రెడిట్ బీజేపీ ఖాతాలో వేయాలంటే ఎలాంటి వ్యూహం అమలు చేయాలి అనేది ప్రస్తుత బిజెపి పర్యటన వెనుక వున్న లక్ష్యంగా కనిపిస్తుంది. అందులో భాగంగా ముందుగా ప్రోజెక్ట్ పనులను పరిశీలించి సమీక్షించి ఆ తరువాత విమర్శలు, ఆరోపణలు గుప్పించాలన్నది కాషాయం ఆలోచన అంటున్నారు విశ్లేషకులు. గతంలో టిడిపి పోలవరంలో మిత్రపక్షం బీజేపీ జోక్యం లేకుండా జాగ్రత్త పడింది. ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ తెలుగు రాష్ట్రాల్లో జండా ఎగురవేయడానికి వున్న అన్ని అంశాలను ఉపయోగించుకోవాలని చూస్తుంది. అమరావతి నుంచి పోలవరం వరకు ప్రతీ కీలక అంశాలు అందిపుచ్చుకోవాలన్న కమలం వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.