ఒంటరి ని చేసే వ్యూహమేనా.. ?
ఏపీ రాజకీయ చక్రం ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతుంది టిడిపిని మరింత పతనం చేయడమే బిజెపి పక్కా వ్యూహం గా కనిపిస్తుంది. దానికి అనుగుణంగా పావులు కదుపుతున్న [more]
ఏపీ రాజకీయ చక్రం ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతుంది టిడిపిని మరింత పతనం చేయడమే బిజెపి పక్కా వ్యూహం గా కనిపిస్తుంది. దానికి అనుగుణంగా పావులు కదుపుతున్న [more]
ఏపీ రాజకీయ చక్రం ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతుంది టిడిపిని మరింత పతనం చేయడమే బిజెపి పక్కా వ్యూహం గా కనిపిస్తుంది. దానికి అనుగుణంగా పావులు కదుపుతున్న తీరు ఇది స్పష్టమైన సంకేతాలనే పంపిస్తుంది. జనసేన ను టిడిపికి దూరంగా జరగాలని ఇప్పటికే సూచనలు అందాయన్న ప్రచారం సాగుతోంది.. చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ఏ ఒక్క రాజకీయ పార్టీలో సపోర్ట్ లేకుండా బిజెపి వ్యూహకర్తలు నరుక్కొస్తున్నారు.
కటీఫ్ అవుతున్న కామ్రేడ్ లు…
గత ఎన్నికల ముందు కామ్రేడ్ లతో కలిసి ప్రయాణించిన జనసేన పై ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఆగ్రహంతో ఉన్నాయి. ఎన్నికల తరువాత అంతంత మాత్రంగా ఉన్న కమ్యూనిస్టు ల జనసేన సంబంధాలు అమిత్ షాకు అనుకూలంగా పవన్ ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశారో నాటి నుంచి మరింత దిగజారాయి. ఎపి లో జనసేన మనుగడ ఇక ప్రశ్నర్ధకమే అని సిపిఎం మధు వ్యాఖ్యానించడం గమనిస్తే భవిష్యత్తులో కామ్రేడ్ లు ఇక పవన్ ను పూర్తి దూరం పెట్టక తప్పని పరిస్థితి ఎదురైంది. విశాఖ ఇసుక లాంగ్ మార్చ్ వరకు బాగానే ఉన్న వీరి బంధం బద్దలు కావడంతో కొత్త రాజకీయ సమీకరణాలు తధ్యమని తేలుతుంది.
మళ్ళీ బాబు చెంతకు వారు…
భారతీయ జనతా పార్టీ మాత్రం చంద్రబాబును క్రమంగా వీక్ చేస్తే తాము లాభపడవచ్చని భావిస్తుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో క్రమేపీ టీడీపీని బలహీన పర్చాలన్నది కమలం పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. బిజెపి దారిలోకి రాకపోతే చంద్రబాబుకు ఉన్న ఆప్షన్ ఒక్కటే. తన పాత మిత్రులు కమ్యూనిస్టు లను కలుపుకుని వెళ్లడమే. ఇక కాంగ్రెస్ ను గత తెలంగాణ ఎన్నికల ముందే దగ్గర చేసుకున్న నేపథ్యంలో వారితో కూడా ఆయన అడుగులు వేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ తో ప్రయాణం చంద్రబాబుకు ఏపీ లో నష్టం తెస్తుందా లాభం తెచ్చేదా అన్నది కాలమే తేల్చాలి.