Bjp : మళ్లీ భారీ స్కెచ్ .. ఓటింగ్ పెంచుకోవాలనేనా?
అందివచ్చిన అవకాశాన్ని బీజేపీ ఎప్పుడూ వదులుకోదు. అందులో ఎన్నికలున్నాయంటే ఆ పార్టీ ప్రజలతో మైండ్ గేమ్ ఆడేందుకే సిద్ధమవుతుంది. ఇప్పుడు గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు బీజేపీ [more]
అందివచ్చిన అవకాశాన్ని బీజేపీ ఎప్పుడూ వదులుకోదు. అందులో ఎన్నికలున్నాయంటే ఆ పార్టీ ప్రజలతో మైండ్ గేమ్ ఆడేందుకే సిద్ధమవుతుంది. ఇప్పుడు గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు బీజేపీ [more]
అందివచ్చిన అవకాశాన్ని బీజేపీ ఎప్పుడూ వదులుకోదు. అందులో ఎన్నికలున్నాయంటే ఆ పార్టీ ప్రజలతో మైండ్ గేమ్ ఆడేందుకే సిద్ధమవుతుంది. ఇప్పుడు గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు బీజేపీ నాయకత్వానికి సవాల్ లాంటివి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ముఖ్యం. ఈ ఎన్నికల ఫలితాలను బట్టి వారి నాయకత్వం కొనసాగడంపై ఆధారపడి ఉంటుంది.
సర్జికల్ స్ట్రయిక్స్ తో….
అందుకే మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ మాట విన్పిస్తుంది. రెండు రోజుల క్రితం అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాక్ పై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని అమిత్ షా హెచ్చరించారు. ఉగ్రవాదులను పాక్ తయారు చేసి భారత్ లోకి పంపుతుందని, పౌరులను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. దాడులను సహించేది లేదని, సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని ఆయన హెచ్చరించారు. దీనికి బీజేపీ నేతలు కూడా సమర్థిస్తున్నారు.
సోషల్ మీడియాలో….
అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికలు రాగానే కమలనాధులకు సర్జికల్ స్ట్రయిక్స్ గుర్తొస్తాయన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు, సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు సర్జికల్ స్ట్రయిక్స్ ను తెరమీదకు తీసుకువచ్చారని, పాక్ తో ఎన్నికలలోపు మరింత కయ్యాన్ని బీజేపీ ప్రభుత్వం పెట్టుకునే సూచనలు ఉన్నాయని కూడా నెట్టింట్లో జోస్యాలు కన్పిస్తున్నాయి.
ప్రజల దృష్టి మళ్లించేందుకు….
బీజేపీ, ఆర్ఎస్ఎస్ లక్ష్యం ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ లలో మళ్లీ పాగా వేయడమే. దాని తర్వాత కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడం. ఇది సాధ్యం కావాలంటే సెంటిమెంట్ తప్పనిసరి. పెట్రోలు ధరల పెంపుదల, నిత్యవసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ, పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చాలంటే సర్జికల్ స్ట్రయిక్స్ బీజేపీ ఖచ్చితంగా చేస్తుందన్న కామెంట్స్ కనపడుతున్నాయి. మరి గెలుపే లక్ష్యంగా బీజేపీ ఏదైనా చేయొచ్చు. మరి వ్యతిరేకత నుంచి బయటపడాలంటే సెంటిమెంట్ ను పండించాలి కదా?