Bjp : నార్త్ టు సౌత్… డేంజర్ బెల్స్ మోగుతున్నాయా?
భారతీయ జనతా పార్టీకి ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. దేశం మొత్తం మీద 31 స్థానాలకు ఎన్నికలు జరిగితే బీజేపీ గెలిచింది ఏడు స్థానాల్లో మాత్రమే. అదీ [more]
భారతీయ జనతా పార్టీకి ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. దేశం మొత్తం మీద 31 స్థానాలకు ఎన్నికలు జరిగితే బీజేపీ గెలిచింది ఏడు స్థానాల్లో మాత్రమే. అదీ [more]
భారతీయ జనతా పార్టీకి ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. దేశం మొత్తం మీద 31 స్థానాలకు ఎన్నికలు జరిగితే బీజేపీ గెలిచింది ఏడు స్థానాల్లో మాత్రమే. అదీ అస్సోంలో మూడు, కర్ణాటకలో ఒకటి, మధ్యప్రదేశ్ లో రెండు, తెలంగాణలో ఒకస్థానంలో బీజేపీ గెలిచింది. బీజేపీ పై ఉన్న వ్యతిరేకతకు ఈ ఎన్నికలు అద్దం పడుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న స్థానాలను కూడా బీజేపీ కోల్పోవడం విశేషం.
రాష్ట్ర పార్టీలపై…?
ఈ ఓటములు రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ రాష్ట్ర పార్టీలపై నెపం మోపవచ్చేమో కాని, బీజేపీకి దేశ వ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయన్నది ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికలపై ప్రభావం చూపిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు స్థానాలను బీజేపీ కోల్పోయింది. ఇటీవల కాలంలో బీజేపీ పై వ్యతిరేకత పెరుగుతుందన్నది వాస్తవం.
ధరల పెరుగుదల?
పెట్రోలు ధరలు రోజూ పెరుగుతుండటం, గ్యాస్ ధరలు పెంచుతుండటం, నిత్యావసర వస్తువల ధరలు మండిపోతుండటంతో ప్రజలు తమ ఓటు ద్వారా కసి తీర్చుకున్నారన్నది వాస్తవం. రాష్ట్ర పార్టీలపై నింద మోపేకన్నా కరోనా తో ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారినా కేంద్రం నిర్దయగా వ్యవహరించడంపట్ల అన్ని వర్గాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లోనూ నాలుగు స్థానాలను బీజేపీ కోల్పోయింది.
దేశ వ్యాప్తంగా….
దేశ వ్యాప్తంగా నార్త్ టు సౌత్ ఎక్కడ చూసినా బీజేపీకి ఉప ఎన్నికల్లో గెలుపు పిలుపు వినిపించలేదు. సమర్థమైన నాయకత్వం ఉన్న చోట మాత్రమే నామమాత్రంగా గెలుపు సాధ్యమయింది. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఇదే రకమైన ఫలితాలు వస్తే మోదీ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా మాటలు మాని చేతల్లో చూపించి ప్రజల జీవితాలను అర్థం చేసుకోగలిగితేనే బీజేపీకి భవిష్యత్ ఉంటుంది. లేకుంటే మోదీ లెక్కను జనమే సరిచేస్తారు.