Bjp : బద్వేలులో బీజేపీ దుస్థితిని చూశారా?
భారతీయ జనతా పార్టీ బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయింది. తమ పార్టీ అభ్యర్థిగా సురేష్ పేరును ప్రకటించింది. కానీ సోషల్ మీడియాలో బీజేపీ దుస్థితిపై [more]
భారతీయ జనతా పార్టీ బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయింది. తమ పార్టీ అభ్యర్థిగా సురేష్ పేరును ప్రకటించింది. కానీ సోషల్ మీడియాలో బీజేపీ దుస్థితిపై [more]
భారతీయ జనతా పార్టీ బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయింది. తమ పార్టీ అభ్యర్థిగా సురేష్ పేరును ప్రకటించింది. కానీ సోషల్ మీడియాలో బీజేపీ దుస్థితిపై కామెంట్స్ లెక్కకు మించి కనపడుతున్నాయి. పార్టీ దుస్థితి ఏంటో బద్వేలులో అభ్యర్థి ప్రకనట చూసిన తర్వాతైనా అర్థమవుతుంది కదా? అని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. జనసేన బద్వేలు బరి నుంచి తప్పుకున్నా పోటీలో బీజేపీ ఉండనుంది.
అభ్యర్థి ఎంపికతో….
బద్వేలు లో బీజేపీ స్ట్రాంగ్ గా లేదన్నది మరోసారి అభ్యర్థి ఎంపికతో అర్థమయింది. బద్వేలులో బీజేపీకి బలం లేదన్నది అందరికీ తెలిసిందే. కడప జిల్లాలోనే ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ వంటి నేతలు తప్పించి ఆ పార్టీకి మరో బలమైన నేత లేరు. వీరిద్దరూ పెద్దగా పార్టీని పట్టించుకోవడం లేదు. ఇక బద్వేలు పరంగా చూసుకుంటే బీజేపీ ఇక్కడ నామమాత్రమేనని చెప్పుకోవాలి. ఈ నియోజకవర్గంలో బీజేపీ పోటీకి దింపండం కేవలం రాజకీయ పరమైన నిర్ణయమే.
ఈ నియోజకవర్గానికి….
బద్వేలులో బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థి పంతల సురేష్ ఈ నియోజకవర్గానికి చెందిన వారు కాదు. ఆయన రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన నేత. ఆయన తొలి నుంచి బీజేపీ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఏబీవీపీ, బీజేవైఎంలలో వివిధ పదవులను నిర్వహించారు. బీజేపీలో దళితనేతగా కొంత పేరుంది. 2019 ఎన్నికల్లో సురేష్ రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఎవరూ లేకపోవడంతో….
రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన వారిని బద్వేలు బరిలో దింపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బద్వేలులో బీజేపీకి సరైన నేత కొరవడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. విజయజ్యోతి పేరును తొలుత పరిశీలించినా ఆమె టీడీపీ నుంచి జనసేన మద్దతుదారుగా ఉండటంతో ఆమె పేరును పక్కన పెట్టారు. సురేష్ పార్టీ సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తి కావడంతో ఆయన ఎంపిక జరిగింది. బద్వేలులో అభ్యర్థి ఎంపికతోనే బీజేపీ దుస్థితి బయటపడిందన్న సెటైర్లు విన్పిస్తున్నాయి.