అయోధ్యలో అలా చేస్తారట
అయోధ్య రామాలయం నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఆగస్టు 5 వ తేదీన అయోధ్య రామాలయానికి భూమి పూజ జరగనుంది. [more]
అయోధ్య రామాలయం నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఆగస్టు 5 వ తేదీన అయోధ్య రామాలయానికి భూమి పూజ జరగనుంది. [more]
అయోధ్య రామాలయం నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఆగస్టు 5 వ తేదీన అయోధ్య రామాలయానికి భూమి పూజ జరగనుంది. వెంటనే అక్కడ పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం నియమించిన కమిటీ ఇప్పటికే చర్యలను వేగవంతం చేసింది. దేశంలోనే అతి ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలన్నది కమిటీ లక్ష్యంగా కన్పిస్తుంది.
భూమి పూజ తర్వాత….
ఆగస్టు నెల 5వ తేదీన అయోధ్య రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు ముఖ్యనేతలు హాజరుకానున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో అతి తక్కువ మందిని ఈ కార్యక్రమానికి అనుమతించాలని కమిటీ నిర్ణయించింది. మోదీతో పాటు కొందరు ముఖ్యమంత్రులు, అయోధ్య రామాలయంతో సంబంధం ఉన్న నేతలతో పాటు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మంత్రులు మాత్రమే ఇందులో పాల్గొననున్నారు. 250 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
ఐదు వెండి ఇటుకలతో….
ప్రధాని మోదీ తొలి ఇటుకను ఇక్కడ పేర్చనున్నారు. రామాలయం నిర్మాణం భూమి పూజ కోసం ఐదు వెండి ఇటుకలను వినియోగించనున్నారు. మోదీ తొలి వెండి ఇటుకను ప్రారంభిస్తారు. మోదీ అమర్చే వెండి ఇటుక 40 కిలోల బరువు ఉంటుందని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. హిందూ శాస్త్ర ప్రకారం ఐదు గ్రహాలకు ఐదు వెండి ఇటుకలను వినియోగించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు.
ప్రతిష్టాత్మకంగా…
అయోధ్య ఆలయ నిర్మాణం విశ్వహిందూ పరిషత్ రూపొందించిన డిజైన్ ను అనుసరించే జరగనుంది. అష్టభుజ ఆకారంలో ఆలయం ఉంటుందని చెబుతున్నారు. ఆలయాన్ని సుమారు 84 వేల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అయోధ్య రామాలయం నిర్మాణం విషయంలో ట్రస్ట్ తో పాటు బీజేపీ, వి.హెచ్.పి, ఆర్ఎస్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో దేశ వ్యాప్తంగా అందరి చూపు ఆలయం పైనే ఉంది.