అఖిలప్రియకు అందుకే దూరమవుతున్నారా?
భూమా కుటుంబానికి ఒకప్పుడు రెండు నియోజకవర్గాల్లో పట్టు ఉండేది. ఇటు ఆళ్లగడ్డతో పాటు నంద్యాల నియోజకవర్గంలోనూ భూమా కుటుంబం నుంచి ఎన్నికయ్యేవారు. రెండు నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ [more]
భూమా కుటుంబానికి ఒకప్పుడు రెండు నియోజకవర్గాల్లో పట్టు ఉండేది. ఇటు ఆళ్లగడ్డతో పాటు నంద్యాల నియోజకవర్గంలోనూ భూమా కుటుంబం నుంచి ఎన్నికయ్యేవారు. రెండు నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ [more]
భూమా కుటుంబానికి ఒకప్పుడు రెండు నియోజకవర్గాల్లో పట్టు ఉండేది. ఇటు ఆళ్లగడ్డతో పాటు నంద్యాల నియోజకవర్గంలోనూ భూమా కుటుంబం నుంచి ఎన్నికయ్యేవారు. రెండు నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉండేది. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి జీవించి ఉన్నంత కాలం క్యాడర్ ను నేతలను ఆ కుటుంబం కాపాడుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో క్యాడర్ చెల్లాచెదురయిపోతోంది.
రెండు నియోజకవర్గాల్లో…..
2019 ఎన్నికల ఫలితాల తర్వాత నంద్యాల, ఆళ్లగడ్డల్లో భూమా కుటుంబ రాజకీయానికి ఇబ్బందులు తలెత్తాయి. అఖిలప్రియ ఆళ్లగడ్డలో పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నా ఆమెను నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఆళ్లగడ్డలో ఉండకుండా ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఉండటం, ఇక్కడ పార్టీని పట్టించుకోకపోవడం అఖిలప్రియకు మైనస్ గా మారింది. అఖిలప్రియ తమను పట్టించుకోవడం లేదన్న ఆవేదన క్యాడర్ లో కనపడుతుంది.
వివాహం తర్వాత…..
ఇక అఖిలప్రియ భర్త కారణంగా కూడా కుటుంబంలో విభేదాలు తలెత్తాయంటారు. ఇప్పటికే భూమా కుటుంబం నుంచి కొందరు బీజేపీలోకి వెళ్లిపోయారు. ఇక తాజాగా భూమా కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న వారు కూడా వైసీపీ పార్టీలో చేరిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా నంద్యాల, ఆళ్లగడ్డల్లో టీడీపీ పరాజయం పాలయింది. కనీసం పోటీ చేసిన వారిని కూడా ఏ రకంగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.
క్యాడర్ ను కాపాడుకునేందుకు….
ఆళ్లగడ్డ లోనే క్యాడర్ ను రక్షించుకునేందుకు అఖిలప్రియ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక నంద్యాలను పట్టించుకునే పరిస్థితి ఏమాత్రం లేదు. నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా అఖిలప్రియ తో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో తన సోదరుడిని పోటీ చేయించాలన్న ఉద్దేశ్యంతో అఖిలప్రియఉండటంతో ఆమె కు దూరమయ్యారని చెబుతున్నారు. మొత్తం మీద రెండు నియోజకవర్గాల్లోనూ భూమా అఖిలప్రియ రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు.