కావలిలో దేకలేరు గాని ఉదయగిరి కావాలా బీదా ?
నెల్లూరు జిల్లాకు చెందిన బీద సోదరులకు తెలుగుదేశం పార్టీలో ఇచ్చిన ప్రయార్టీ మామూలుగా కాదు. 2009కు ముందు బీద సోదరులు పార్టీలో కీలక పొజిషన్లో ఉండేవారు. బీద [more]
నెల్లూరు జిల్లాకు చెందిన బీద సోదరులకు తెలుగుదేశం పార్టీలో ఇచ్చిన ప్రయార్టీ మామూలుగా కాదు. 2009కు ముందు బీద సోదరులు పార్టీలో కీలక పొజిషన్లో ఉండేవారు. బీద [more]
నెల్లూరు జిల్లాకు చెందిన బీద సోదరులకు తెలుగుదేశం పార్టీలో ఇచ్చిన ప్రయార్టీ మామూలుగా కాదు. 2009కు ముందు బీద సోదరులు పార్టీలో కీలక పొజిషన్లో ఉండేవారు. బీద రవిచంద్ర యాదవ్ తెలుగు యువతలో యాక్టివ్‌గా ఉండేవారు. 2009 ఎన్నికల్లో కావలి నుంచి బీద మస్తాన్‌రావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నాడు వైఎస్ ప్రభంజనంలో కూడా బీద కావలిలో గెలవడం గ్రేటే. ఆ తర్వాత వీరు కాస్త దూకుడుగా ఉండడంతో పాటు కావలి నియోజకవర్గంలో టీడీపీకి కొమ్ము కాసే కొన్ని సామాజిక వర్గాలకు దూరం జరగడంతో 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినా కావలిలో బీద మస్తాన్‌రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి మరీ ఓడిపోయారు.
పట్టు కోల్పోవడంతో….
పార్టీ గెలిచి కావలిలో బీద మస్తాన్ రావు ఓడడంతో వీరికి పట్టు తప్పింది. పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీరు మరింత దూకుడుగా ముందుకు వెళ్లడం మైనస్‌గా మారింది. ఒకానొక దశలో కావలిలో బీద సోదరులు మరో రెండు, మూడు సార్లు కూడా గెలవరని టీడీపీ వాళ్లే చర్చించుకున్నారు. చంద్రబాబు బీద మస్తాన్‌రావు సోదరుడు రవిచంద్రకు జిల్లా పార్టీ పగ్గాలు ఇవ్వడంతో పాటు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. వాళ్లకు పదవులు పెరగడంతో జిల్లాలో పట్టు కోసం, జిల్లా పార్టీలో ఇతర నాయకులపై పెత్తనం కోసం ప్రయత్నాలు చేశారే తప్ప కావలిలో పార్టీని పటిష్టం చేయలేదు.
ఒకానొక దశలో…..
గత ఎన్నికల్లో కావలి కష్టమని తేలడంతోనే బీద మస్తాన్‌రావు నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడారు. ఇటు కావలిలోనూ టీడీపీ ఓడిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే అన్న మస్తాన్ వైసీపీలోకి జంప్ చేసేశారు. బీద రవిచంద్ర టీడీపీలోనే కొనసాగడంతో పాటు సమీకరణలు కలిసి రావడంతో చంద్రబాబు ఆయనకు పార్టీలో రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చారు. ఒకానొక దశలో లోకేష్ బీద రవిచంద్రనే ఏపీ టీడీపీ అధ్యక్షుడిని చేయాలని ప్రతిపాదించారన్న టాక్ కూడా వచ్చింది. ప్రస్తుతం చాలా వీక్‌గా ఉన్న నెల్లూరు జిల్లాలో పార్టీని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం కూడా రవిచంద్ర వైపు నుంచి జరగడం లేదు.
కావలిపై ఆశల్లేకనేనా….?
కావలిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలిచినప్పుడు బీద సోదరులు చేసిన హడావిడితోనే 2014లో ఓడారు. ప్రస్తుతం నియోజకవర్గంలో బీదపై తీవ్ర వ్యతిరేకత ఉంది. సోదరుడు మస్తాన్ రావు వైసీపీలోకి వెళ్లిపోవడంతో బీద ఫ్యామిలీ అనుచరగణం రెండుగా చీలి ఓ వర్గం అన్నతో వెళ్లిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీలోనే యూనిటీ లేదు. కావలి కలిసొచ్చే పరిస్థితి లేదు. దీంతో బీద రవిచంద్ర వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆశ నెరవేర్చుకునేందుకు ఉదయగిరి వైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం నెల్లూరు జిల్లాలో చాపకింద నీరులా జరుగుతోంది.
అందుకే అటువైపు…..
ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు యాక్టివ్‌గా ఉండడం లేదు. ఈ క్రమంలోనే బీద రవిచంద్ర యాదవ్ ఉదయగిరి వైపు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అయితే అదే సమయంలో ఈ సీటు నుంచి ఈ సారి టీడీపీ రెడ్డి వర్గం నేత పేరు పరిశీలనకు తెస్తోంది. మరి బాబు ఈక్వేషన్‌ను కాదని బీద రవిచంద్రకు ఇక్కడ సీటు విషయంలో ఎంత వరకు సక్సెస్ అవుతాడన్నది చెప్పలేం. అయితే బీద ఉదయగిరి మీద కన్నేశారన్న వార్తలు మాత్రం నెల్లూరు టీడీపీలో ఇంటర్నల్‌గా వైరల్ అవుతున్నాయి.