అసలు పోటీయే కాదట.. సర్దుబాటులో మాత్రం?
ఎన్నికల తేదీ ప్రకటించక ముందే బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. బీహార్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. [more]
ఎన్నికల తేదీ ప్రకటించక ముందే బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. బీహార్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. [more]
ఎన్నికల తేదీ ప్రకటించక ముందే బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. బీహార్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. బీజేపీ, జేడీయూ కూటమి వర్చువల్ ర్యాలీలను నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ కూడా బీహార్ లోని పశ్చిమ పంచారన్ జిల్లాలో ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. మరోవైపు ఆర్జేడీ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధం చేసుకుంటుంది.
అవగాహనకు రావడంతో….
బీహార్ లో 243 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ, జేడీయూ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో ఒక అవగాహనకు వచ్చింది. చెరి సగం సీట్లను పంచుకునేలా, మరికొన్ని చిన్న పార్టీలకూ పరిమితమైన సీట్లు ఇద్దరూ ఇచ్చేలా అవగాహన కుదిరింది. త్వరలోనే దీనిపై జేడీయూ, బీజేపీ సీనియర్ నేతలు కూర్చుని చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి బీజేపీ, జేడీయూలు ప్రచారంలోకి వెళ్లాలని భావిస్తున్నాయి.
ఇంకా సీట్ల సర్దుబాటులో…
ఇంకా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి సీట్ల సర్దుబాటు పై ఒక అవగాహన రాలేదు. ఇది కొంచెం ఇబ్బంద కరమే. అభ్యర్థుల ఎంపిక కూడా ఈ కూటమి ఆలస్యం చేసే అవకాశముంది. అయితే ప్రచారాన్ని మాత్రం ముందుగానే ప్రారంభించాలని నిర్ణయించాయి. అయితే ఆర్జేడీ మాత్రం తమకు నితీష్ కుమార్ తో పోటీ యే లేదని చెబుతోంది. తాము కేవలం బీజేపీతోనే పోటీ పడుతున్నామని ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వీ యాదవ్ ప్రకటించడంతో ఎన్నికల వాతావరణం మరింత హీటెక్కింది.
ప్రచారం షురూ…..
అసలు బీహార్ లో నితీష్ కుమార్ కు బలం లేదంటున్నారు. 1995లో సమతా పార్టీ కేవలం ఏడు స్థానాలను మాత్రమే గెలుచుకుందని, 2014లో సొంతంగా బరిలోకి దిగితే రెండు స్థానాలకే పరిమితమయిందని తేజస్వి యాదవ్ గుర్తు చేశారు. బీహార్ర లో కులపరమైన ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా కులాలకు సంబంధించిన కేంద్ర మంత్రులను ప్రచారానికి పంపేందుకు ప్లాన్ చేేసుకుంటున్నారు. మొత్తం మీద బీహార్ ఎన్నికల వేడి ప్రారంభమయిందనే చెప్పాలి.